కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో అమర కావ్యం పేరుతో విడుదల కానుంది. నవంబర్ 28న హిందీలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్‌హిట్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


