బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్ పేరు చెప్పగానే చాలామందికి రాహుల్ సిప్లిగంజ్ పండించిన ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. అదే సీజన్‌లో పాల్గొన్న పునర్నవి భూపాలంతో ఓ రేంజ్ కెమిస్ట్రీ పండించాడు. దీంతో నిజంగానే వీళ్లు ప్రేమికులేమో అని అందరూ అనుకున్నారు. షో నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పలు షోల్లో జంటగా కనిపించారు. కానీ అదంతా షో కోసమే.
ఇకపోతే కొన్నిరోజుల క్రితమే రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పునర్నవి కూడా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది. తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. కశ్మీర్‌లో అతడు తనకు ప్రపోజ్ చేయగా 'యస్' చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పునర్నవి ప్రియుడి పేరు హేమంత్ వర్మ. ఇతడో ఫొటోగ్రాఫర్ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)
తెనాలికి చెందిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఒక చిన్న విరామం, సైకిల్ తదితర చిత్రాల్లో నటించింది. అలానే 'కమిట్ మెంటల్' అనే ఓటీటీ సిరీస్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అయితే వీటిలో దేనితోనూ రాని గుర్తింపు 'బిగ్‌బాస్' షోతో సంపాదించింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు గానీ పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. సైకాలజీ, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
చివరకు 2020లో సినిమాల్లో కనిపించిన పునర్నవి.. తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. ఇప్పుడు సడన్‌గా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఫొటోలు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెప్పేస్తారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'కోర్ట్' బ్యూటీ కొత్త సినిమా.. ఈసారీ ప్రేమకథే)




