ర‌ణ‌వీర్ సింగ్ ‘దురంధర్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Dhurandhar Movie Twitter Review And Public Talk | Sakshi
Sakshi News home page

Dhurandhar X Review: ర‌ణ‌వీర్ సింగ్ ‘దురంధర్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Dec 5 2025 11:25 AM | Updated on Dec 5 2025 11:35 AM

Dhurandhar Movie Twitter Review And Public Talk

బాలీవుడ్‌ స్టార్‌ ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దురంధర్‌’. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా, ఆర్‌ మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 5)ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్‌ ప్రీమియర్స్‌ డిసెంబర్‌ 4న తేది రాత్రే పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురంధర్‌ ఎలా ఉంది? రణ్‌వీర్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.

ఎక్స్‌లో దురంధర్‌ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమా బాగుందని, రణ్‌వీర్‌ వన్‌మ్యాన్‌ షో అంటూ అని పలువురు నెటిజన్స్‌  ట్వీట్స్‌ చేస్తున్నారు.

‘దురంధర్‌’ దేశభక్తిని రేకెత్తించే డీసెండ్‌ యాక్షన్‌ డ్రామా. అద్భుతమైన థ్రిల్లింగ్స్‌ అంశాలు ఉన్నాయి. మేజర్ మోహిత్ పాత్రలో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తెలిసిన కథే అయినా కథనం ఎంగేజింగ్‌గా ఉంటుందంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు. 
 

 ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ కొన్నీ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్షయ్ ఖన్నా, మాధవన్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్‌తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement