పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఏమన్నారంటే.. | Allu Arjun Comments On Pushpa 2 One Year Celebration | Sakshi
Sakshi News home page

పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..

Dec 5 2025 11:23 AM | Updated on Dec 5 2025 11:28 AM

Allu Arjun Comments On Pushpa 2 One Year Celebration

అల్లు అర్జున్, సుకుమార్‌  కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం‘పుష్ప: ది రూల్‌’.. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ సోషల్‌మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిన పుష్ప అనేక రికార్డ్‌లను క్రియేట్‌ చేసింది. కేవలం బాలీవుడ్‌లోనే రూ.750 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. పుష్ప ప్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయం అందుకోవడంతో అల్లు అర్జున్‌ ఇమేజ్‌ చాలా ఎత్తుకు చేరుకుంది.

పుష్ప-2కు ఏడాది సందర్భంగా అల్లు అర్జున్‌ ఇలా అన్నారు. ' పుష్ప మా జీవితంలో మరపురాని ఐదు సంవత్సరాల ప్రయాణం. నా జీవితంలో పుష్ప చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు నుంచి అపారమైన ప్రేమ, బలం, ధైర్యం ఈ సినిమాతో మాకు దక్కింది. ఈ మూవీ విజయంలో  ప్రపంచవ్యాప్తంగా భాగమైన  ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. నాతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు, నిర్మాతలు, పంపిణీదారులు, మా కెప్టెన్ సుకుమార్‌తో కలిసి ఈ ప్రయాణంలో నడవడం నాకు గౌరవంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  కృతజ్ఞతతో నిండిన హృదయంతో అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement