‘ఓయ్ మీసాల పిల్ల... నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలె పిల్ల...’ అంటూ ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ఎంత బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘శశిరేఖ...’ అంటూ సాగే ద్వితీయ పాట ప్రోమోను ఈ నెల 6న, పూర్తి వీడియో సాంగ్‌ని 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.


