నవీన్ పొలిశెట్టి- మీనాక్షీ చౌదరి నటించిన చిత్రం అనగనగా ఒక రాజు.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'రాజు గారి పెళ్లి రో' అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించగా మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.


