breaking news
Anaganaga Oka Raju Movie
-
ఒకేరోజు రెండు హిట్ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే
ఈ సంక్రాంతి సీజన్లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్‌గా నిలిచాయి. థియేటర్ రన్ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్‌గా మారుతుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా ఉండనున్నాయి. -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
వాలంటైన్స్ వీక్ వచ్చేసింది. గతవారం చాలానే తెలుగు సినిమాలు, థియేటర్లలోకి వచ్చాయి కానీ ఒక్కటి నిలబడలేదు. ఈ వీకెండ్.. విశ్వక్ సేన్ 'ఫంకీ'తో పాటు 'కపుల్ ఫ్రెండ్లీ', 1+1 ఆఫర్ అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే సీతాపయనం, బూకి అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటివి రీ రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 16 వరకు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి హిట్స్ అయిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు బేబీ గర్ల్ అనే మలయాళ డబ్బింగ్ మూవీ, ద కంజూరింగ్, ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ అనే హాలీవుడ్ డబ్బింగ్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 09 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11లీడ్ చిల్డ్రన్ (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 11లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 11తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ మూవీ) - ఫిబ్రవరి 12జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్క్రాస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 1హాట్స్టార్ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఫిబ్రవరి 12ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11సన్ నెక్స్ట్సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13సోనీ లివ్బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 12ఆపిల్ టీవీ ప్లస్ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్అమర్ విశ్వాస్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11 -
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్‌లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్‌లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
ఏడు తరాలు గుర్తుండిపోతుంది: నవీన్ పొలిశెట్టి
'‘నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్ పొలిశెట్టి ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ‘అనగ నగా ఒక రాజు’’ అని నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ ‘దిల్’ రాజు చెప్పారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవానికి ‘దిల్’ రాజు, దర్శకుడు బాబీ కొల్లి అతిథులుగా హాజరయ్యారు.బాబీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల నేను చిరంజీవిగారిని కలిసినప్పుడు... ‘అనగనగా ఒక రాజు’ బాగుందట కదా... ఈ తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతి మా యూనిట్‌కి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది’’ అని నవీన్ పొలిశెట్టి చెప్పారు. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశామనడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూసి మా కష్టమంతా మర్చిపోయాను’’ అని మారి తెలిపారు. మీనాక్షీ చౌదరి, రచయిత్రి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, రచయిత చంద్రబోస్ మాట్లాడారు. -
'ఆంధ్ర టూ తెలంగాణ'ను ఊపేసిన వీడియో సాంగ్ విడుదల
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆంధ్ర టూ తెలంగాణ' అంటూ సాగే ఈ పాటలో నవీన్ స్టెప్పులకు శాన్వీ మేఘన గ్లామర్‌తో ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపానా, సమీర్ భరద్వాజ్ పాడారు. సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు. -
‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?
2026లో అప్పుడే మొదట నెల పూర్తయిపోయింది. కళ్లు మూసి తెరిచేలేపో జనవరి అయిపోయింది. ఈ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సందడి వినిపించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలే దీనికి కారణం. ఇంతకీ తెలుగు ఇండస్ట్రీకి ఈ నెల ఎలా గడిచింది? ఏమేం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)నెల ప్రారంభంలోనే సైక్ సిద్ధార్థ్, వనవీర, 45, గులాబీ తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. వీటిలో ఒక్కటి కూడా మెప్పించలేకపోయాయి. మరోవైపు సంక్రాంతి సినిమాల గురించి జనాల ఎదురుచూడటంతో తొలివారం ముగిసిపోయింది. రెండోవారం వచ్చేసరికి ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్స్, దర్శకుడి మారుతి మాటలు వినేసరికి అభిమానులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కట్ చేస్తే తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. లాంగ్ రన్లో డిజాస్టర్‌గా మిగిలింది.ఈసారి చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'.. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలో రిలీజైంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన వారం పదిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. కంటెంట్ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ చిరంజీవి మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయింది. రూ.350 కోట్ల కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత రోజు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రిలీజైంది. చిరు సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో దీన్ని జనాలు లైట్ తీసుకున్నారు. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనే మాట వినిపించింది కానీ పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీతో సక్సెస్ అందుకుంది. నాగవంశీ నిర్మాత కావడంతో ఉన్నంతలో థియేటర్లు కూడా బాగానే దొరికాయి. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'కి హిట్ టాక్ వచ్చింది గానీ అప్పటికే జనాలు చిరంజీవి మూవీ మూడ్‌లో ఉండటంతో దీన్ని కొందరు మాత్రమే చూశారు. పండగ మూవీస్ హడావుడి ఉంటుందని మూడో వారం ఒక్క కొత్త చిత్రం కూడా రిలీజ్ కాలేదు. చివరి వారంలో తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా 'ఓం శాంతి శాంతి శాంతిః' రిలీజైంది. మక్కీకి మక్కీ రీమేక్ కావడం, కంటెంట్ ఓకే ఓకే ఉండటంతో జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు. హిట్ అయ్యే అవకాశాలు తక్కువే. అలానే 'దేవగుడి'తో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రిలీజయ్యాయి. కానీ వీటిని పట్టించుకునే నాథుడు లేడు.ఓవరాల్‌గా చూసుకుంటే చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' మాత్రమే ఈ నెలలో హిట్స్ అయ్యాయి.(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి) -
‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
'రాజు గారి పెళ్లిలో' నవీన్ పొలిశెట్టి-మీనాక్షి స్టెప్పులు
నవీన్ పొలిశెట్టి- మీనాక్షీ చౌదరి నటించిన చిత్రం అనగనగా ఒక రాజు.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'రాజు గారి పెళ్లి రో' అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించగా మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
డ్యాన్స్ అదరగొట్టిన మీనాక్షి.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉన్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు. -
డల్లాస్ థియేటర్స్ లో కేకలు.. USలో నా సినిమా హౌస్ ఫుల్
-
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్లో ప్రతి సీజన్‌కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్‌పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే. ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్లో కామెడీ చిత్రాల ట్రెండ్ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు. -
ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: నాగవంశీ
‘త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను’ అన్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’.నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాం. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నిర్మాత నాగవంశీ హృదయపూర్వక ధన్యవాదాలు’అన్నారు.నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది’ అన్నారు. -
బక్కచిక్కిన బుల్లిరాజు.. ఆ రెండు కారణాల వల్లే..
ఒక్క సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు బుల్లిరాజు. వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బుల్లిరాజు నోరు తెరిస్తే బూతులు.. అయినా సరే కొలికేత్త.. కొలికేత్త అంటూ బుల్లిరాజు చేసిన కామెడీకి జనాలు పడీపడీ నవ్వారు. ఇతడి కామెడీ టైమింగ్‌కు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.డబుల్ ధమాకాఅలా 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీలోనూ మెప్పించాడు. గతేడాది బుల్లిరాజు నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలాగైతే బ్లాక్‌బస్టర్ కొట్టిందో ఈ 'మన శంకరవరప్రసాద్‌గారు' కూడా అంతే మెగా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీంతో బుల్లిరాజు అలియాస్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ దశ తిరిగిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీలోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కూడా విజయపథంలో నడుస్తుండటంతో ఈసారి సంక్రాంతికి డబుల్ ధమాకా అందుకున్నాడు.అందుకే సన్నబడ్డాడా?అయితే సినిమా ఈవెంట్స్‌లో మాత్రం కాస్త బక్కచిక్కి కనిపించాడు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. అతడికి వైరల్ ఫీవర్ వచ్చింది. రెండు.. తెరపై కాస్త సన్నగా కనిపించాలని బుల్లిరాజే భావించాడట! ఓ ఈవెంట్లో రేవంత్ మాట్లాడుతూ.. నేను దాదాపుగా 10 సినిమాలు చేస్తున్నాను. అన్ని సినిమాల్లో ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది? ఒక మూవీలో కాస్త డిఫరెంట్‌గా కనిపిద్దాం అని డైట్ చేశా.. అందుకే సన్నబడ్డా..రెండో సినిమాయే మెగాస్టార్‌తో..ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుంటారు. నేను తీసిన మొదటి సినిమాకే ఆయనతో నటించే ఆఫర్ వచ్చింది. అది నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన విషయం.. సంక్రాంతికి వస్తున్నాంలో బూతులు తిట్టా.. కానీ, మన శంకర వరప్రసాద్లో బూతులు తిట్టలేదు. అదే తేడా.. అన్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బిజీ స్టార్ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతి బ్లాక్బస్టర్లు ఖాతాలో వేసుకుంటూ సంక్రాంతి బుల్లోడుగా మారిపోయాడు.చదవండి: తొలి సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్ల తర్వాత.. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: అనగనగా ఒక రాజునటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: మారిసంగీతం: మిక్కీ జె. మేయర్విడుదల తేది: జనవరి 14, 2026హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగజగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).ఎలా ఉందంటే..తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు. ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతాం. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్‌లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్ తండ్రిగా రావు రమేశ్ రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనబడుతుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా సినిమాలో పండగ ఎనర్జీని చూస్తారు: నవీన్ పొలిశెట్టి
‘‘మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండగ. ఎన్ని బాధలున్నా మర్చిపోయి మన వాళ్లను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి పిండి వంటలు తింటూ నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి పండగ ఎనర్జీని మా ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా మా సినిమా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు.మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇదొక పర్ఫెక్ట్ పండగ సినిమా. అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘కుటుంబంతో కలిసి మా సినిమా చూడండి... హాయిగా నవ్వుకుంటూ ఈ సంక్రాంతి పండగను జరుపుకోండి’’ అని చెప్పారు. ‘‘మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి’’ అన్నారు మారి. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ‘అనగనగా ఒక రాజు’ రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు... ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది’’ అని తెలిపారు. బాల నటుడు రేవంత్ (బుల్లిరాజు) మాట్లాడాడు. -
'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్ రిలీజ్తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్. 'నాలోన సోకులున్నయ్, సొంపులున్నయ్ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్ సీపన, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ శాన్వి మేఘన నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్ చింపేశాడు.. మెగాస్టార్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు -
యాక్టింగ్ వదిలేద్దామనుకున్నాను: మీనాక్షీ చౌదరి
‘‘మన జీవితాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా జీవితాన్ని మా అమ్మ, మా టీచర్స్ ఎంతో ప్రభావితం చేశారు. ఇప్పుడు హీరోయిన్లకు బలమైనపాత్రలు లభిస్తుండటం సంతోషంగా ఉంది. నేను కూడా బలమైనపాత్రలే చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ల మధ్యపోటీ గురించి ఆలోచించను.పోటీ అనేది ప్రతిచోటా ఉంటుంది. నా వరకు క్రమశిక్షణతో కష్టపడుతుంటాను. నా స్కూల్, కాలేజీ, మిస్ ఇండియా కాంపిటీషన్.. ఇలా ప్రతిచోట నేనుపోటీ చూశాను’’ అని చెప్పారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన సినిమా ‘అనగనగా ఒకరాజు’. మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’, 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో ఆడియ న్స్ ముందుకు వస్తున్నాను. అయితే నేను ఏదీప్లాన్ చేయలేదు. ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో సంపన్న కుటుంబంలో పుట్టిన చారులత అనేపాత్రలో నటించాను. నవీన్గారితో వర్క్ చేయడం అనేది సినిమా టీచింగ్ స్కూల్లా ఉంది.‘గుంటూరు కారం, లక్కీభాస్కర్’ తర్వాత ఇప్పుడు ‘అనగనగా ఒకరాజు’ సినిమాలు సితార బ్యానర్లో చేశాను. మారి మంచి ప్రతిభగల దర్శకుడు. ఇండస్ట్రీలో నటిగా సెటిల్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు నూతన నటీనటులు వస్తూనే ఉంటారు. దీంతో ప్రతి రోజూ పరుగే. నటిగా ‘ఔట్ ఆఫ్ లవ్’ అనేది నా తొలి సిరీస్ (టీవీ సిరీస్). ఈ షూట్లోపాల్గొన్న తొలిరోజే నాకు ఇబ్బందిగా అనిపించి, నా మేనేజర్‌కి కాల్ చేసి, ‘యాక్టింగ్ వద్దు. సినిమాలు వదిలేద్దామనుకున్నాను’ అని చెప్పాను. మనం కాంట్రాక్ట్ సైన్ చేశామని చెప్పి నన్ను కన్వి న్స్ చేశారు. ఆ తర్వాత యాక్టర్‌గా నేను మెరుగై రాణిస్తున్నాను. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ నన్ను బాధపెట్టాయి. నాకు పుస్తకాలు రాయడం ఇష్టం. నాగచైతన్యగారితో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
డేటింగ్ రూమర్స్..పిచ్చ లైట్ అంటున్న హీరోయిన్
సినీ తారలు అన్నాక.. రకరకాల రూమర్స్ వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఏవోవో రాస్తుంటారు. ప్రేమలో పడకపోయినా..త్వరలోనే పెళ్లి అంటూ పోస్టులు పెడుతుంటారు. ఇక డేటింగ్ రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పుకార్లను కొంతమంది నటీనటులు పర్సనల్‌గా తీసుకుంటారు. బాధ పడతారు. భయపడతారు.. ఖండిస్తారు. మరికొంతమంది అయితే.. ఎన్ని పుకార్లు వచ్చిన పట్టించుకోరు. దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా..తమ పని తాము చేసుకొని వెళ్తారు. తాను కూడా ఆ బాపతే అంటోంది అందాల తార మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ట్రోలింగ్, రూమర్స్ అనేవి పిచ్చ లైట్‌గా తీసుకుంటానని చెబుతోంది.ఇటీవల మీనాక్షి ప్రేమ, పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే మీనాక్షి మాత్రం ఈ రూమర్స్‌ని ఖండించింది. సుశాంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రూమర్స్ ఆగడం లేదు. అయితే ఇలాంటి పుకార్లను చూసి నవ్వుకుంటానే తప్ప అస్సలు హార్ట్‌కు తీసుకోనని మీనాక్షి చెప్పింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘అనగనగ ఒకరాజు’ జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సోసల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని ఎలా తీసుకుంటారు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానంగా చెప్పింది. సెలెబ్రెటీల పెళ్లిపై పుకార్లు రావడం కామన్.. ఇప్పటికే నాకు సోషల్ మీడియాలో చాలా సార్లు పెళ్లి చేశారంటూ మీనాక్షి నవ్వేసింది. -
ఏపీలో 'రవితేజ, నవీన్' సినిమాలకు టికెట్ ధరలు పెంపు
సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రాలకు ప్రీమియర్ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా సింగిల్ స్క్రీన్స్‌లలో రూ. 50, మల్టీఫ్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. -
'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు
-
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
‘అనగనగా ఒక రాజు’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఈ సంక్రాంతికి చివరిగా రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది ఈ ట్రైలర్. ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుడిలో ఉన్న హుండీలో నోట్ల కట్టను వేసేందుకు హీరో ప్రయత్నించడం..అందులో పట్టకపోవడంతో ‘పంతులుగారు.. ఎన్నిసార్లు చెప్పానండి..కన్నం పెద్దది చేయమని..నోట్లు పట్టట్లేదు’ అని నవీన్ అంటే.. చిల్లర వేయడం కోసం చిన్నగా పెట్టామని పంతులు అంటాడు. వెంటనే ‘చిల్లరగాళ్ల కోసం సపరేట్ హుండీ పెట్టండి’ అని నవీన్ పంచ్ విసురుతారు. ఇలా ట్రైలర్ మొత్తం నవీన్ మార్క్ కామెడీతో సాగుతుంది. అమెరికాకు వెళ్లే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతి పాత్రలో మీనాక్షి చక్కగా నటించింది. మీనాక్షి, నవీన్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరించదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు. మొత్తానికి, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండగ వాతావరణం అన్నీ కలగలిసిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్‌బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్‌లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్‌లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్‌తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ని నేడు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్‌ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్‌గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే
ప్రతిసారి సంక్రాంతి బరిలో రెండో మూడో సినిమాలు వస్తుండేవి. ఈసారి మాత్రం డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా ఏడు మూవీస్ బరిలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందోనని హీరోల కంటే అభిమానులకే చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వీళ్లే కాదు దాదాపు 12 మంది హీరోయిన్లు కూడా ఈ పండక్కే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లందరికీ హిట్ చాలా కీలకం.(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?)మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్'.. ఈ శుక్రవారం(జనవరి 09) థియేటర్లలోకి రానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. నిధి విషయానికొస్తే తెలుగులో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తోంది గానీ 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ అన్నీ అడియాశలయ్యాయి. చేతిలో ఇది తప్పితే మరొక ప్రాజెక్ట్ అయితే లేదు. హిట్ అయితేనే కెరీర్ పరంగా కాస్త ఫుష్ ఉంటుంది లేదంటే కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి. మాళవిక విషయానికొస్తే.. తమిళ, మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇందులో అందచందాలు చూపించేందుకు అస్సలు మొహమాట పడలేదు. ఇది హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడుతోంది. రిద్ధి కుమార్ విషయానికొస్తే.. గతంలో ప్రభాస్ చేసిన 'రాధేశ్యామ్'లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకుబోతోంది. తెలుగులో ఈమెకు మరో ఛాన్స్ రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే.రాబోయే సోమవారం(జనవరి 12) చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈమె అడపాదడపా తెలుగులో మూవీస్ చేస్తోంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో సరైన హిట్ లేదు. బాలకృష్ణ కొత్త మూవీ కోసం ఈమెని తీసుకున్నారని ప్రకటించారు గానీ ఇప్పుడు బడ్జెట్, కథ మార్పు వల్ల బదులుగా మరో హీరోయిన్ని పెట్టే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయన్ టాలీవుడ్ కెరీర్‌కి ప్లస్ అవ్వాలంటే చిరు మూవీ హిట్ కావాలి.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)13వ తేదీన రానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్. ఆషిక విషయానికొస్తే కన్నడ అమ్మాయి. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఫ్లాప్. కానీ నాగార్జున 'నా సామి రంగ'లో అవకాశమొచ్చింది. హిట్ అందుకుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో ఇప్పుడీ మూవీతో వస్తోంది. ఈమె నటించిన మరో తెలుగు చిత్రం 'విశ్వంభర' కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ రెండు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డింపుల్ విషయానికొస్తే.. గత ఎనిమిదేళ్లలో తెలుగులో ఆరు మూవీస్ చేసింది. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది హిట్ అయితే మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే అంతే సంగతి!14న రానున్న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి హీరోయిన్. తెలుగులోనే ఈమె హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇదే రోజున శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రిలీజ్ కానుంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంయుక్త కూడా తెలుగులో సర్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హిట్ అందుకుంది. కానీ డెవిల్, అఖండ 2తో ఫెయిల్యూర్స్ చవిచూసింది. ఈ మూవీ హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సాక్షి వైద్యకు కూడా ఈ చిత్రం సక్సెస్ కావడం ముఖ్యమే.డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే.. 9వ తేదీన వచ్చే 'జన నాయకుడు'లో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె తెలుగు తెరకి దూరమై చాలా రోజులైంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో అవకాశాలు రావొచ్చు. అలానే తెలుగు దర్శకుల దృష్టిలోనూ పడొచ్చు. ఇదే మూవీలో మమిత బైజు కీలక పాత్ర చేసింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంటే ఈమెకు దక్షిణాదిలో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. 10వ తేదీన రానున్న 'పరాశక్తి'లో శ్రీలీల హీరోయిన్. ఈమె కూడా తెలుగులో వరస సినిమాలు చేసింది గానీ ఒకటో రెండో మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కాస్త కష్టమవ్వొచ్చు!(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్) -
బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి: నవీన్ పొలిశెట్టి
‘వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ, 2024లో జరిగిన ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ 'అనగనగా ఒక రాజు' కథ రాసుకోవడం జరిగింది. మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాం. జనవరి 14న విడుదలవుతున్న 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అన్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో 'రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక'ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది నా మూడో సంక్రాంతి సినిమా. 'అనగనగా ఒక రాజు'లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’అన్నారు. -
‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'అనగనగా ఒక రాజు' నుంచి పెళ్లి సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మారి అనే దర్శకుడు.. ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)పెళ్లి నేపథ్యంగా తీసిన ఈ పాట కూడా ట్రెండింగ్ పదాలతో ఉంది. బీట్ కూడా బాగుంది. నవీన్-మీనాక్షి డ్యాన్స్ కూడా కలర్ఫుల్గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లు కాస్త నెమ్మదించడంతో.. మూవీ వాయిదా పడే అవకాశముందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పాట రిలీజ్ చేసి అలాంటివే లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. నిర్మాత నాగవంశీ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసారి వాయిదా ఉండదని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్) -
పెద్ద టైటిల్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురూ!
టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్‌ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం. మన శంకరవరప్రసాద్‌గారు... ‘ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47... కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.... హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్‌తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అనగనగా ఒకరాజు ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్‌పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది. 2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆకాశంలో ఒక తార ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. హుషారెత్తించే పాట రిలీజ్
'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఇప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్ఫుల్గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?) -
భీమవరం బల్మా
‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదం పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న విడుదల కానుంది.మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే పాటని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మారి. మిక్కీ జె. మేయర్ చక్కని సంగీతం అందించారు. ఈ మూవీలోని ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే పాట విడుదల వేడుకని భీమవరంలోని ఎస్కేఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం నిర్వహిస్తున్నాం’’ అని యూనిట్ తెలిపింది. -
ఎలన్ మస్క్ ఎరికేనా మీకు.. ఆ రాకెట్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న లేటేస్ట్ ప్రోమో!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఛాన్స్ వస్తే చాలు ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్‌లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్‌మెన్‌ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. JaaneJigars. First song from #AnaganagaOkaRaju BLASTING SOON 🔥🔥 Mee andariki Deepavali Subhakankshalu. Love you guys. Can’t wait for Sankranthi😍🔥Here is the DIWALI BLAST promo 💣▶️ https://t.co/YI94w3Q97c @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/5jHE399ZXg— Naveen Polishetty (@NaveenPolishety) October 20, 2025 -
అనగనగా ఒక రాజు.. ప్రమోషన్స్ వేరే లెవెల్!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు. పొలిశెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. -
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’
సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్. ట్యాగ్‌లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు. దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందో చూడాలి. -
అనగనగా ఒక రాజు.. నవ్వులు పూయిస్తోన్న సంక్రాంతి ప్రోమో!
జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తాజాగా నటిస్తోన్న చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju Movie). ఈ చిత్రంలో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. సినీ ప్రియులను తెగ నవ్వించేసింది.ఇంకా ఈ మూవీ రిలీజ్‌కు దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ మేకర్స్ ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి చాలా సరదాగా నవ్వులు పండించారు. సినిమా ప్రమోషన్లో 24 క్యారెట్స్ గోల్డ్ అంటూ ఫన్నీగా ప్రోమోలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.కాగా.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.Jaanejigars. Pandaga ki kalludam :) ❤️😍Here is the #AnaganagaOkaRaju SANKRANTHI PROMO 😎🕺– https://t.co/5EUHhVXeHd Love you guys. Cannot wait to see you on the big screen ❤️🙏 #AOROnJan14th 💫@Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84 #SaiSoujanya #GandhiN… pic.twitter.com/KfyPIikYG8— Naveen Polishetty (@NaveenPolishety) September 26, 2025


