అనగనగా ఒక రాజు.. నవ్వులు పూయిస్తోన్న సంక్రాంతి ప్రోమో! | Naveen Polishetty Anaganaga Oka Raju Movie Latest Promo out now | Sakshi
Sakshi News home page

Anaganaga Oka Raju Promo: అనగనగా ఒక రాజు.. నవ్వులు తెప్పిస్తోన్న నవీన్, మీనాక్షి!

Sep 26 2025 1:28 PM | Updated on Sep 26 2025 3:01 PM

Naveen Polishetty Anaganaga Oka Raju Movie Latest Promo out now

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తాజాగా నటిస్తోన్న చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju Movie). చిత్రంలో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మూవీకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. సినీ ప్రియులను తెగ నవ్వించేసింది.

ఇంకా మూవీ రిలీజ్కు దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ మేకర్స్ ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించారు. నేపథ్యంలోనే సంక్రాంతి ప్రోమోను రిలీజ్చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి చాలా సరదాగా నవ్వులు పండించారు. సినిమా ప్రమోషన్లో 24 క్యారెట్స్గోల్డ్ అంటూ ఫన్నీగా ప్రోమోలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

కాగా.. సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement