ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే భారతదేశానికి చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా?
రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన వారి వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .
గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్‌స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం.
ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్ చెప్పాడు.
మండల్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్‌కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పాడు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు.
ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి


