ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్‌కు మంచిదంటూ ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీదాడులు చేస్తే మరింత తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మరోవైపు, ఇరాన్ కూడా దీటుగా బదులిస్తోంది. అమెరికా హద్దు మీరిందని.. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది. యూఎస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది.
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన అనంతరం ఇవాళ (ఆదివారం) ఉదయం ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఖమేలీ మృతిపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ ట్రంప్ నిన్న(శనివారం) ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమేనీని చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.


