టెహ్రాన్: ఇరాన్‌లో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యంత సన్నిహిత వర్గంలో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. ఈ నియామకం తర్వాత అరాఫీ ముగ్గురు సభ్యుల లీడర్‌షిప్ కౌన్సిల్‌లో చేరారు.
అరాఫీ ప్రస్తుతం ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధిపతిగా, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన విద్యా వ్యవస్థలో ఆయనకు ఉన్న అనుభవం, శియా సమాజంలో ఆయనకు ఉన్న ప్రభావం కారణంగా ఈ పదవికి ఎంపికయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామం ఇరాన్ రాజకీయ, మతపరమైన వర్గాల్లో కీలకంగా పరిగణించబడుతోంది. కొత్త నాయకత్వం దేశంలో శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో అన్నది అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించారని ఇరాన్ మీడియా ఆదివారం (మార్చి 1,2026)నివేదించింది.
అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 2026 ఫిబ్రవరి 28న ఆయనను లక్ష్యంగా చేసుకుని అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. ఈ దాడులు టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్నాయి. 86 ఏళ్ల వయసులో ఖమేనీ మరణం ఇరాన్‌లో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన నాయకత్వానికి ముగింపు పలికింది.


