తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా? | Are New Movies Premiere Shows And Ticket Hikes Really Necessary? Tollywood Faces Backlash Over Increasing Negativity | Sakshi
Sakshi News home page

Tollywood: ప్రీమియర్ షోలతో మంచి కంటే చెడు ఎక్కువ?

Jan 10 2026 1:54 PM | Updated on Jan 10 2026 3:07 PM

Telugu Movies Premiere And Ticket Hike Issue Details

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిన్నా పెద్దా సంబంధం లేదు. దాదాపు ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వీటి వల్ల చిన్న సినిమాలకు కాస్త ప్లస్ అవుతోంది గానీ పెద్ద చిత్రాలకు మాత్రం మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఊహించని దానికంటే మైనస్ అవుతుంది. ఏ చిత్రమైనా సరే ప్రీమియర్ షోలు వేయడం నిజంగా అవసరమా?

పది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలోనూ ఒకటో రెండో థియేటర్లు ఉండేవి. ప్రతివారం చిన్నా పెద్దా సినిమాలు అందులో రిలీజయ్యేవి. టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉండేది కాదు. స్టార్ హీరోల మూవీస్‌ అయినా చిన్న హీరోల చిత్రాలైనా ఒకటే రూల్. కాకపోతే పేరున్న హీరోల సినిమాలకు కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చేవి. అప్పట్లో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు లాంటి హంగామా ఉండేది కాదు. అంతా ప్రశాంతం. అప్పట్లో కథలు కూడా ప్రేక్షకులు తమని తాము సినిమాల్లోని ఆయా పాత్రలతో పోల్చి చూసుకునేలా ఉండేవి.

కానీ ఇప్పుడు నగరాల్లో తప్ప ఊళ్లలో థియేటర్లు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. సిటీల్లో అయినా గ్రామాల్లో అయినా వీకెండ్ వస్తేనే చాలా తక్కువ మంది ప్రేక్షకులు.. థియేటర్ వైపు చూస్తున్నారు. మరీ బాగుంది అనిపిస్తే తప్పితే సినిమాకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. టికెట్ ధరల్లోనూ చిన్న పెద్ద సినిమాలకు బోలెడంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి లేదంటే వేకువజామున షోలు వేస్తున్నారు. వీటి వల్ల బోలెడంత నెగిటివిటీ ఏర్పడుతోంది.

(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')

మనసు ప్రశాంతంగా ఉంటేనే సినిమాని ఆస్వాదించగలం. రాత్రివేళల్లో దాదాపు అందరూ నిద్రపోయే సమయాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకుల్లోనూ చాలామందికి అది నిద్రపోయే టైమ్ అయ్యిండొచ్చు. వాళ్లు మూవీని నిద్ర మబ్బుతో చూడటం, సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రివ్యూలు చెప్పడం వల్ల మరింత చేటు జరుగుతోంది. అదే రిలీజ్ రోజు ఉదయాన్నే సినిమా చూస్తే బాగలేకపోయినా మూవీ కూడా పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అని అనిపించే అవకాశముంది.

కానీ గత కొన్నాళ్ల నుంచి తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టిన బడ్జెట్ ఎలాగైనా రాబట్టేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్నారు. వందల వందల రూపాయల టికెట్ ధరలకు అదనంగా పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుడు.. థియేటర్‌కి వెళ్తాడేమో గానీ సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు.. ఇంతింత ఖర్చు చేసి ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని తనలో తానే అనుకుంటున్నాడు. 

ఇదేదో ఒకటి రెండుసార్లు జరిగితే పర్లేదు. అలవాటు అయిపోతే మాత్రం అలాంటి ప్రేక్షకుడిని తిరిగి థియేటర్‌కి తిరిగి రప్పించడం కష్టం. ప్రస్తుతం అలానే చాలామంది థియేటర్లకు దూరమైపోయారు. ప్రీమియర్ షోలే ఇలాంటి వాటికి ప్రధాన కారణమవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రీమియర్ షోలు వేయాలి, టికెట్ ధరలు పెంచేయాలని అనుకుంటున్నారు తప్పితే సరైన కంటెంట్‌తో వద్దాం. సాధారణ ధరలకే టికెట్స్ అమ్ముదాం అని మాత్రం ఆలోచించట్లేదు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement