breaking news
Premiere show
-
మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం
చిరంజీవి హీరోగా, రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కొదమసింహం’. కె. మురళీమోహన రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నిర్వహించిన ప్రెస్ మీట్లో కైకాల నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఒకవైపు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తూనే మరోవైపు ‘కొదమసింహం’ చేశారు. ఈ సినిమాని మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. రీ రిలీజ్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని మురళీమోహన్ రావు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్ మాట్లాడారు. ఆ క్యాసెట్ పెడితేనే చరణ్ భోజనం చేసేవాడు: చిరంజీవి వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కొదమసింహం’ నా ఫేవరెట్ మూవీ. నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితేనే భోజనం చేసేవాడు. కృష్ణగారు చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అయింది. అలాంటి కౌబాయ్ సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. అయితే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ రావు వచ్చి నాకు ‘కొదమసింహం’ కథ చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపాను. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్‌బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్. ఆయన కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి, మెప్పించి ఉండేవారు కాదు’’ అని చె΄్పారు. -
ఇప్పటికే టికెట్ రూ.1000.. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్‌కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.ఒక్కో టికెట్ రూ.1000..ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
‘పుష్ప 2’ ప్రీమియర్ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు సీపీఆర్ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. -
అల్లు అర్జున్ పుష్ప-2.. ఓవర్సీస్లో మరో రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నెల రోజుల ముందే పండుగ మొదలైంది. డిసెంబర్ 5న రిలీజవుతోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎక్కడ చూసినా పుష్ప మానియా కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఒక్క అమెరికాలోనే రికార్డ్ స్థాయి బుకింగ్స్‌తో పుష్ప-2 దూసుకెళ్తోంది.ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. యూఎస్ ప్రీమియర్ షోస్ బుకింగ్స్‌లో క్రేజీ రికార్డ్ నమోదు చేసింది. అత్యంత వేగంగా 50 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ జాబితాలో అత్యంత వేగంగా సాధించిన భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఇంకా 28 రోజుల సమయం ఉండగా.. ముందు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. The reign at the box office begins 💥💥#Pushpa2TheRule is the fastest Indian film to hit $500K+ pre-sales for the USA premieres ❤️🔥USA Premieres on 4th December.GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/8CgO0t4qcx— Pushpa (@PushpaMovie) November 7, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. రిలీజ్‌కు ముందే ప్రభంజనం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే నెల రోజల కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే రిలీజ్‌కు ఇంకా నెల రోజులు సమయం ఉండడంతో వరుసగా అప్డేట్లతో మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 15న ట్రైలర్ భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే అందరికంటే ముందుగా ఓవర్సీస్లో పుష్ప-2 ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజులు ముందుగానే టికెట్స్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా 15వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ ద్వారా పంచుకుంది. అమెరికాలో ఇంత వేగంగా టికెట్స్ అమ్ముడైన భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇది కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. Shattering records, one at a time 💥💥#Pushpa2TheRule becomes the fastest Indian Film to sell 15K+ tickets in the USA ❤🔥USA Premieres on 4th December 🤩GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/dFsrLtg5zV— Pushpa (@PushpaMovie) November 6, 2024 -
ఖైదీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో.. అభినందించిన అధికారులు!
కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. జైలులోని దాదాపు 2500 ఖైదీల కోసం సినిమాను జైలులోనే ప్రదర్శించడం విశేషం. ఈ అవకాశం కల్పించిన చర్లపల్లి జైలు అధికారులకు, పోలీస్ విభాగనికి చిత్రయూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఇలాంటి ఒక మంచి అనుభూతిని పొందుతానని కలలో కూడా ఊహించలేదని ధనరాజ్ అన్నారు.ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్ ఇది మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్రబంద సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.For the first time ever, team #RamamRaghavam 🏹 arranged special Premiere show for Charlapalli Jail prisoners on Gandhi Jayanthi❤️Gratitude to Jail Superintendent #GowriRamachandram garu🤗#RR Coming Soon to theatres🤩@thondankani @DhanrajOffl @suneeltollywood @Mokksha06… pic.twitter.com/xAV27xzNy5— Dhanraj koranani (@DhanrajOffl) October 4, 2024 -
రిలీజ్‌కి ముందే మహేశ్ 'గుంటూరు కారం' సినిమా రికార్డ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు దాదాపు ఏడాదిన్నర తర్వాత థియేటర్లలోకి రాబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో తీసిన 'గుంటూరు కారం'.. జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఓవైపు హంగామా నడుస్తుంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మహేశ్ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. మహేశ్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో అందరి దృష్టి 'గుంటూరు కారం' పైనే ఉంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో అది కూడా మాస్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో రిలీజ్ విషయం వేరే లెవల్లో ప్లాన్ చేశారు. (ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?) అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ విషయంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్-3800కి పైగా, సలార్-2450కి పైగా షోలు వేశారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు మూవీకి ఈ రేంజు ప్రీమియర్ షోలు అంటే సరికొత్త రికార్డే. దీనిబట్టి చూస్తుంటే విడుదలకు ముందే హాఫ్ మిలియన్ డాలర్స్.. ముందస్తు బుకింగ్స్ రూపంలో వచ్చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో 5-6 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం గ్యారంటీ అనిపిస్తోంది. జనవరి 12న థియేటర్లలోకి వచ్చే 'గుంటూరు కారం'లో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని తల్లి సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందించాడు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'హను-మాన్' అదే రోజు రిలీజ్ కానుండటం విశేషం. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
'ఫారే' ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
రిలీజ్‌కు ముందే రోర్.. కళ్లు చెదిరేలా సలార్ ప్రీ బుకింగ్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే'బాహుబలి' తర్వాత వచ్చిన చిత్రాలు వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాయి. ఇటీవల రిలీజైన ఆదిపురుష్ సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సలార్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!) అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అంతేస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది ప్రభాస్ సలార్. విడుదలకే ముందే ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఇటీవల అమెరికాలో సలార్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్లో సలార్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 150 వేల డాలర్ల ప్రీ బిజినెస్ జరిగిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక్క అమెరికాలోనే ఈ రేంజ్లో సలార్ ప్రీ బుకింగ్స్ కావడంతో.. ఇక ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా ఫ్లాప్ అయితే తప్పు ఫ్యాన్స్‌దా? ఇదెక్కడి లాజిక్!) కాగా.. గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రమిదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Salaar USA Presales crossed $150,000🦖💥 DINOSALAAR ROARS FROM 28 Sep 2023 💥😎#Prabhas#SalaarCeaseFire #SalaarTakeOverUSA pic.twitter.com/8dDGp8ROBB — Sai Eswar 💖 (@Prabhas_Raju44) August 23, 2023 idi kuda 36 Days before with only 5% Of the bookings open tho ne... Just imagine if songs & trailer were released by now and Bookings official ga 500+ shows tho open chesi unte eh range lo undevoo🙏🔥🔥🔥🔥#Prabhas 👑#SalaarTakeOverUSA https://t.co/okLXvwSoa7 — • (@Roopuuuu) August 23, 2023 Without Any Songs/Trailer Release, #Prabhas's #Salaar Already Grossed Over $150K in the USA 🙏🔥🔥🔥 More than 50% of the Total Premiere Advance Sales Are From These #CineMark Theatres: • Dallas XD And IMAX • Legacy And XD • West Plano And XD#SalaarTakeOverUSA 🔥 pic.twitter.com/5NuwtL1JxU — Hail Prabhas (@HailPrabhas007) August 23, 2023 -
Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి
ఆదరణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . సన్నీకి హెల్ప్ చేసిన అనురాగ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్ మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్ హైదరీలు కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పెవిలియన్ లో ‘లయనీస్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరి, సంధు ముఖ్య తారలు. -
బ్లాక్ డ్రెస్‌లో సమంత సరికొత్త లుక్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఈమధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్గా కేరళలో ఖుషి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు సిటీడెల్ కోసం లండన్ వెళ్లింది.రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డేకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ లండన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక, రిచర్డ్‌లతో పాటు సమంత, వరుణ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రిమియర్‌కు హాజరైన సమంత ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్లాక్ డ్రెస్‌లో, డైమండ్ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, పలువురు సెలబ్రిటీలు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేశ్ కూతురు ఆశ్రిత సైతం సామ్ లుక్స్‌కి స్టన్నింగ్ అంటూ రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు: చిరంజీవి
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. హాలీవుడ్లో సూపర్ హిట్టైన ఫారెస్ట్ గంప్ చిత్రం ఆదారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతకంపై ఈ సినిమాను నిర్మించారు.కరీనా కపూర్ ఇందులో హీరోయిన్గా నటించింది. అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలరాజుగా కీలకమైన పాత్రలో చై కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ ఏఎమ్బి సినిమాస్‌లో నిర్వహించిన ప్రీమియర్ షో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిగారు, మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, మెగానిర్మాత అల్లు అరవింద్, యువ హీరోలు సాయితేజ్, అల్లు శిరీష్, కార్తికేయ, దర్శకులు మారుతి, హరీశ్ శంకర్, నిర్మాతలు సురేశ్ బాబు తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ లాంటి నటుడు దేశం గర్వించదగ్గ నటుడని కొనియాడారు. 'ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అలాగు లాల్ సింగ్ చడ్డాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మనఃస్పూర్తిగా నమ్ముతున్నాను'అని పేర్కొన్నారు. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులో లీడ్ రోల్లో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరోయిన్గా అలరించనున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావుతోపాటు కరీనా కపూర్ కూడా హాజరైంది. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటే కరీనా కపూర్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది. అందుకే కరీనా నిద్రపోతోంది', 'ఫారెస్ట్ గంప్ సినిమాను అమీర్ చూడలేదేమో.. అందుకే బాగా ఎమోషనల్ అవుతున్నాడు' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ and kareena kapoor slept because of her own screentime in the film — Saharsh (@whysaharsh) July 21, 2022 చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్‌కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్‌లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్‌కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్‌తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్‌తో స్టైలిష్ గెటప్‌లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్‌లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
రొమాంటిక్ మూవీ ప్రీమియర్ షో టాక్
-
ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి
-
‘అజ్ఞాతవాసి’కి అనుమతి నిరాకరణ
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రోజు అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేసేందుకు అనుమతి నిరాకరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షో వేసేందుకు అనుమతించిన నేపథ్యంలో తెలంగాణాలోనూ ప్రీమియర్ షోలకు అనుమతి లభిస్తుందని భావించారు. అయితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించారు. ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి ప్రత్యేక షోలు వేసేందుకు భ్రమరాంభ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లలో ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించటంతో రేపు ఉదయం (10-01-2018) ఎనిమిది గంటలకు తొలి షో పడనుంది. -
'థ్యాంక్యూ మిత్రమా' షార్ట్ ఫిలిమ్ ప్రివ్యూ
-
’చీకటిరాజ్యం, ప్రీమీయర్ షోకు మంత్రి కేటీఆర్
-
క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు :చిరంజీవి
‘‘క్రికెట్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిల్లో ‘లగాన్’ బెస్ట్ అని నా అభిప్రాయం. ఆటిజంతో బాధ పడుతున్న కుర్రాడికి క్రికెట్‌పై ఉన్న ప్రేమను ఇందులో చూపించారు. ఇప్పటివరకూ క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్నేహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సచిన్’. సుహాసిని ప్రత్యేక పాత్ర పోషించారు. ఎస్.మోహన్ దర్శకుడు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. కె.విశ్వనాథ్, చిరంజీవి, టి.సుబ్బిరామిరెడ్డి, కుట్టి పద్మిని, మారుతి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘‘నటిగా సుహాసిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి మంచి సినిమాలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉంది. స్నేహిత్ బాగా నటించాడు. దర్శకుడు మోహన్ చేసిన మంచి ప్రయత్నమిది’’ అన్నారు. 45 ఏళ్ల పైచిలుకు వయసులో 11 ఏళ్ల అబ్బాయికి అక్కగా నటించడం ఆనందంగా ఉందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సుహాసిని చెప్పారు. ఇందులో సుహాసిని నటన చూసి ఈర్ష్య కలిగిందని, కథ నచ్చి హిందీ హక్కులు తీసుకున్నానని నటి కుట్టి పద్మిని అన్నారు.


