Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి | Cannes 2023: Internet loves Sunny Leone Cannes red carpet look at Kennedy premiere | Sakshi
Sakshi News home page

Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి

May 26 2023 5:02 AM | Updated on May 26 2023 5:02 AM

Cannes 2023: Internet loves Sunny Leone Cannes red carpet look at Kennedy premiere - Sakshi

ఆదరణ ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో రాహుల్‌ భట్, సన్నీ లియోన్  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్‌. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్‌ ఒవేషన్  చిత్ర యూనిట్‌కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్‌ కార్పెట్‌పై సన్నీ లియోన్  నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్  సినిమాను రిప్రజెంట్‌ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ .

సన్నీకి హెల్ప్‌ చేసిన అనురాగ్‌
కాన్స్ రెడ్‌ కార్పెట్‌పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్  మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్‌ కశ్యప్‌ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్‌ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్‌ హైదరీలు కూడా రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్  పెవిలియన్ లో ‘లయనీస్‌’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్‌ హైదరి, సంధు ముఖ్య తారలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement