మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా 'ఆవేశం' సీక్వెల్ రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇండస్ట్రీలో వైవిధ్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ సంచలన విజయం అందుకుంది. కేవలం మలయాళంలోనే రూ.150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం అనేక రికార్డ్స్‌ను తిరగరాసింది. ఇందులో రౌడీ షీటర్‌గా ఫహద్ నటన బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. 2024లో దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీ సీక్వెల్ గురించి తాజాగా ప్రకటన వచ్చేసింది.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఫహద్ మాట్లాడుతూ.. ఆవేశం 2 పనులు జరగుతున్నాయని ధృవీకరించారు. ఈ సీక్వెల్ 2027 లేదా 2028లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు జితు మాధవన్ ప్రస్తుతం సూర్యతో తన మొదటి తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అతను ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, ఫహద్ ఫాజిల్‌తో ఆవేశం సీక్వెల్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఆవేశం మూవీలో ఫహద్ ఫాజిల్‌తో పాటు హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు నటించారు. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు.


