ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu February Second Week | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఒక్క వారంలో 16 మూవీస్ స్ట్రీమింగ్.. మరి థియేటర్లలో?

Feb 9 2026 8:00 AM | Updated on Feb 9 2026 8:00 AM

Upcoming OTT Movies Telugu February Second Week

వాలంటైన్స్ వీక్ వచ్చేసింది. గతవారం చాలానే తెలుగు సినిమాలు, థియేటర్లలోకి వచ్చాయి కానీ ఒక్కటి నిలబడలేదు. ఈ వీకెండ్.. విశ్వక్ సేన్ 'ఫంకీ'తో పాటు 'కపుల్ ఫ్రెండ్లీ', 1+1 ఆఫర్ అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే సీతాపయనం, బూకి అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటివి రీ రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 16 వరకు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి.

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి హిట్స్ అయిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు బేబీ గర్ల్ అనే మలయాళ డబ్బింగ్ మూవీ, ద కంజూరింగ్, ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ అనే హాలీవుడ్ డబ్బింగ్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 09 నుంచి 15 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11

  • కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11

  • లీడ్ చిల్డ్రన్ (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 11

  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 11

  • తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ మూవీ) - ఫిబ్రవరి 12

  • జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13

  • మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13

  • ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్

  • క్రాస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 1

హాట్‌స్టార్

  • ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఫిబ్రవరి 12

  • ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13

జీ5

  • మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11

సన్ నెక్స్ట్

  • సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13

సోనీ లివ్

  • బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 12

ఆపిల్ టీవీ ప్లస్

  • ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13

అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్

  • అమర్ విశ్వాస్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement