ఏపీలో 'ఫంకీ' టికెట్‌ ధరలు పెరగనున్నాయా..? | AP Govt Likely To Hike Ticket Prices For Vishwak Sen Funky Movie, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో 'ఫంకీ' టికెట్‌ ధరలు పెరగనున్నాయా..?

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 9:36 AM

Vishwak Sen Funky Movie tickets price WILL hike in AP

టాలీవుడ్‌ నటుడు విశ్వక్‌సేన్‌కు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే.. ఆయన హీరోగా నటించిన ఫంకీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జాతిరత్నాలు ఫేమ్‌ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీని తెరకెక్కించడంతో మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మించారు. అయితే, ఏపీలో ఈ మూవీ టికెట్‌ రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటకే ఏపీ ప్రభుత్వాన్ని ఫంకీ నిర్మాతలు కోరినట్లు సమాచారం.

నిర్మాత నాగవంశీ నిర్మించిన ఫంకీ సినిమా టికెట్ ధరపై ఏపీలో రూ. 50 పెంచబోతున్నారా..? అంటే నిజమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్‌ ధరలు పెంపుకోసం అనుమతి ఇచ్చే వారు. కానీ, ఇప్పుడు ఫంకీ వంటి చిన్న బడ్జెట్‌ చిత్రానికి కూడా ధరలు పెంచేందుకు  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో సింగిల్‌ థియేటర్‌లో ఇకనుంచి రూ. 50 టికెట్‌ ధర పెరగనుందని కొద్దిరోజుల క్రితమే నాగవంశీ అన్నారు. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. 

రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం టికెట్‌ ధరలు ఎలా ఉన్నాయో వంశీ ఇలా చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్‌ ధర ఉంది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ. 175 వరకు ఉంది. కానీ,  ఏపీలో కొన్ని సింగిల్‌ థియేటర్స్‌లలో టికెట్‌ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా  కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నామని ఆయన గతంలో అన్నారు. అయితే, ఫంకీ సినిమాకు సంబంధించిన జీఓ వస్తే అసలు విషయం క్లారిటీగా తెలుస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement