funky
-
విశ్వక్సేన్ 'ఫంకీ' సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
ప్రేక్షకులు నిరాశ చెందరు
విశ్వక్ సేన్ , కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఫంకీ’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ సక్సెస్‌మీట్‌లో విశ్వక్సేన్ మాట్లాడుతూ–‘‘సినిమా రిలీజ్‌కు ముందు ఒత్తిడితో ఉండటం సహజం. కానీ ‘ఫంకీ’ సినిమా రిలీజ్‌కు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ రోజు ఉదయం ప్రేక్షకులతో కలిసి ఈ మూవీ చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఫంకీ’ నాకెంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. ‘‘కుటుంబంతో కలిసి ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ‘ఫంకీ’ చేశాం. ప్రేక్షకుల స్పందన సంతోషాన్నిఇస్తోంది’’ అని తెలిపారు కేవీ అనుదీప్. ‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఈ విషయంలో మేం విజయం సాధించాం. మా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ. నవ్వుకోవడానికి థియేటర్స్‌కు వచ్చిన వారు నిరాశ చెందరు’’ అన్నారు నాగవంశీ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కయాదు లోహర్. -
'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం
'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన కొత్త సినిమా 'ఫంకీ' థియేటర్లలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లు కాగా నాగవంశీ నిర్మించాడు. విడుదలకు ముందు కాస్త బజ్ ఉంది. అలానే రిలీజైంది. కానీ తొలి షో నుంచే మిక్స్డ్, నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అంతగా పండలేదని, స్టోరీ కూడా ఏం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి ఏమంత పాజిటివ్‌గా మాట్లాడట్లేదు. ఈ క్రమంలోనే బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ పెట్టగా.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?)'రివ్యూయర్లకి నచ్చదు అని నాకు ముందే తెలుసు. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు. మేము కావాలనే అలా తీసాం. ఎడిటింగ్ సమస్య కాదది. నేను సాగర సంగమం తీసా అని చెప్పానా? ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని. మీరేదో సైంటిస్ట్‌లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా. సినిమాకు కావాల్సిన గ్లామర్ అయితే లేదు. అది తెలిసే సినిమా తీశాం'.. ఇలా సాగాయి నాగవంశీ మాటలు.పైన స్పీచ్‌లో ఎక్కడా కూడా ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమా తీశాం అనే మాట వినబడలేదు. నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని నాగవంశీ అంటున్నారు. కానీ కొన్నిచోట్ల తప్పితే ప్రేక్షకులు.. మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న 'ఫంకీ'.. వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమానిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: అనుదీప్ కె.వి.సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్ సేన్ హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కోమల్ (విశ్వక్ సేన్) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్(నరేశ్) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్ సినిమాలంటే తెలుగు ఆడియన్స్‌కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్ డైలాగ్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్ లైనర్స్‌తో పంచ్ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్ డైలాగ్స్ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్ డైలాగ్స్ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్ డైలాగ్స్ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్ కూడా కామన్ ఆడియన్స్‌కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. డైలాగ్స్ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్ పాయింట్ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం కాస్త వేగంగా సాగుతుంది. అనుదీప్, కల్యాణ్ శంకర్ల గెస్ట్ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్ సెంటిమెంట్ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..విశ్వక్ సేన్ మంచి నటుడే. అయితే అనుదీప్ రాసిన ‘కోమల్’క్యారెక్టర్ అతనికి సరిగా సూట్ అవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు. కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు. కయాదు లోహర్ తెరపై అందంగా కనిపించింది. నరేశ్ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్ రాజ్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు: విశ్వక్ సేన్
‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫంకీ’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా మా సినిమా చూసి హాయిగా నవ్వుకుంటారు’’ అని విశ్వక్ సేన్ తెలిపారు. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఫంకీ’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘ఫంకీ’ నా కెరీర్లో మొదటి కామెడీ సినిమా’’ అన్నారు కయాదు లోహర్. ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథ ఇది. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. -
హీరోగా చేయడం నాకు ఇష్టం లేదు
‘‘నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. దీంతో నా సినిమాల్లో కథ, లాజిక్‌లు ఉండవని ఆడియన్స్‌కు అనిపించవచ్చు. కానీ నా అన్ని సినిమాల్లో కథ, లాజిక్ ఉంటాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగానే ‘ఫంకీ’ ట్రైలర్‌ను కట్ చేశాం. ట్రైలర్లో ఎక్కువగా కామెడీ సీన్స్ కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో మంచి లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చెప్పారు కేవీ అనుదీప్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరల సమావేశంలో కేవీ అనుదీప్ పంచుకున్న సంగతులు. ⇒ ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ సినిమా దర్శకుడి పాత్ర చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘ఫంకీ’లోని హీరో క్యారెక్టరైజేషన్‌కు విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. కథ నచ్చి, ఆయన ఒప్పుకున్నారు. ⇒ జాతి రత్నాలు’తోపోలిస్తే ‘ఫంకీ’ కొత్తగా ఉంటుంది. దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, సరదాగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కొన్ని ఊహించని సన్నివేశాలను కూడా చూస్తారు. నిర్మాతలు నాగవంశీ, ‘దిల్’ రాజులతో పాటు దర్శకులు హరీష్ శంకర్, కల్యాణ్ శంకర్ గెస్ట్ రోల్స్ చేశారు. నేను కూడా నటించాను. కానీ హీరోగా యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. దర్శకుడిగా నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి.⇒ విశ్వక్ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. హీరోకు సమానమైన పాత్రలో కయాదు యాక్ట్ చేసింది. ఈ చిత్రం విషయంలో నాగవంశీగారితో కంటే కూడా నేను చినబాబుగారితో ఎక్కువగా ట్రావెల్ చేశాను. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి, మంచి సలహాలు ఇచ్చారు. ⇒ ప్రతి సినిమా హిట్ కావాలనే ఆకాంక్షతోనే చేస్తాం. కానీ నా గత చిత్రం ‘ప్రిన్స్’కు సరైన రిజల్ట్ రాలేదు. స్క్రిప్ట్ వర్క్‌కు సరైన సమయం దొరకలేదు. ‘ఫంకీ’ స్క్రిప్ట్‌కు మంచి టైమ్ దొరికింది... మంచి కథ కుదిరింది. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉంటే ఆ సినిమా ఆడియన్స్‌కు చేరువ అవుతుంది. అలా ‘జాతి రత్నాలు’ విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. ఇక ‘జాతిరత్నాలు 2’ ఇప్పట్లో ఉండదు. కథ పరంగా సంతృప్తిగా ఫీలైనప్పుడే ‘జాతిరత్నాలు 2’ చేస్తాం. ⇒ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల్లో నేను సినిమాలు చేయాల్సి ఉంది. వెంకటేశ్‌గారితో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. రవితేజగారితో సినిమా కోసం చర్చలు జరిగాయి కానీ ఈ సినిమా ఉండదు. ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఉంది. -
Funky Movie: ఉర్రూతలూగించేలా ‘యమ యమ్మ’ పాట
‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది.భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించాడు. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. విశ్వక్ సేన్, కయాదు లోహర్ అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన నృత్యరీతులతో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.గీతావిష్కరణ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఫంకీ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు." అన్నారు. -
ఏపీలో 'ఫంకీ' టికెట్ ధరలు పెరగనున్నాయా..?
టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్కు యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. ఆయన హీరోగా నటించిన ఫంకీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మించారు. అయితే, ఏపీలో ఈ మూవీ టికెట్ రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటకే ఏపీ ప్రభుత్వాన్ని ఫంకీ నిర్మాతలు కోరినట్లు సమాచారం.నిర్మాత నాగవంశీ నిర్మించిన ఫంకీ సినిమా టికెట్ ధరపై ఏపీలో రూ. 50 పెంచబోతున్నారా..? అంటే నిజమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంపుకోసం అనుమతి ఇచ్చే వారు. కానీ, ఇప్పుడు ఫంకీ వంటి చిన్న బడ్జెట్ చిత్రానికి కూడా ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుందని కొద్దిరోజుల క్రితమే నాగవంశీ అన్నారు. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం టికెట్ ధరలు ఎలా ఉన్నాయో వంశీ ఇలా చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. కానీ, ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్‌లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నామని ఆయన గతంలో అన్నారు. అయితే, ఫంకీ సినిమాకు సంబంధించిన జీఓ వస్తే అసలు విషయం క్లారిటీగా తెలుస్తోంది. -
విశ్వక్ సేన్‌కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
ప్రముఖ నటుడు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట విశ్వక్ సేన్ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ గురించి అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.గతంలో విశ్వక్‌తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్ సేన్ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్ అన్నారు.విశ్వక్పై అర్జున్ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్ అంటూ అర్జున్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్ కూతురు హీరోయిన్గా విశ్వక్ సేన్‌తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Crazziee Stuff (@crazziee_stuff) -
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మైక్ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్‌ను చూస్తుంటే అనుదీప్‌ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026 -
ఫంకీ ట్రైలర్: పంచులే పంచులు!
గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్సేన్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ నిండా పంచులేట్రైలర్ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు డాక్టర్ అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. ఓనర్‌కు రెంట్ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తయ్ అంటాడు హీరో. ట్రైలర్ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్ చేశారు. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి హైప్ ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
ఫంకీలో రామ్ మిర్యాల పాడిన జోష్ సాంగ్.. విన్నారా?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్‌ను వదిలారు. 'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ జోష్‌తో కొనసాగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ సమకూర్చాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. చదవండి: నవీన్ పొలిశెట్టి ఆంధ్ర టూ తెలంగాణ సాంగ్ రిలీజ్ -
స్కూల్లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా.. కానీ చివరకు
డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్‌ని అడగ్గా..'స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు) -
మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు
తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎక్స్ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్‌గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)#Funky లో Romantic Scenes PEAKS లో ఉంటాయి... EXTREME అసలు..రొమాంటిక్ Scenes లో #Anudeep చాలా UNCOMFORTABLE అయిపోయాడు!!- #VishwakSen pic.twitter.com/DSigVrImla— Movies4u Official (@Movies4u_Officl) January 26, 2026 -
ధీరే... ధీరే
ధీరే... ధీరే అంటూ పాట అందుకున్నారు విశ్వక్ సేన్, కయాదు లోహర్. ఈ ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోని పాట ఇది. సినిమాలో వచ్చే ఈ తొలి పాటను బుధవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘ఫంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ పాటలో విశ్వక్–కయాదుల జోడీ, పాటలోని కొత్తదనం యువతకు చేరువయ్యేలా ఉంటుంది’’ అని తాజాగా విడుదల చేసిన ‘ధీరే... ధీరే’ పాట గురించి యూనిట్ పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం అలరించే హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుందని, ‘ఫంకీ’ అనేది ప్రేక్షకులకు ఓ మంచి వినోదాల విందు అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
విశ్వక్-అనుదీప్ సినిమా.. చెప్పిన టైం కంటే ముందే రిలీజ్
గత కొన్ని సినిమాలతో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న విశ్వక్ సేన్.. ఈసారి కామెడీ రూట్లోకి వచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే టీజర్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. గత నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో మూవీ విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రెండు నెలల ముందుకు తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ముందు చెప్పినట్లు ఏప్రిల్‌లో కాకుండా ఫిబ్రవరి 13న 'ఫంకీ' విడుదలవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే షూటింగ్‌తో పాటు మిగిలిన పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్‌కి చాలా కీలకం.టీజర్ బట్టి చూస్తే ఇదో సినిమా డైరెక్టర్ కథ. దర్శకుడిగా విశ్వక్ కనిపిస్తుండగా.. హీరోయిన్ పాత్రలో నిర్మాత కూతురిగా కాయదు లోహర్ చేస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో రెగ్యులర్ ఫన్ ఉండబోతుందనే అనిపిస్తుంది. మరి ఈసారి విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Your ticket to a crazy, fun-filled experience with #FUNKY arriving on 13th FEB! 🕺Fun for all. Madness for everyone. 100% Entertainment guaranteed. 😎In cinemas #FunkyFrom13thFeb 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/kGHEGd2QkC— Sithara Entertainments (@SitharaEnts) December 15, 2025 -
విశ్వక్ సేన్- అనుదీప్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్‌గా పేరున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 3న సమ్మర్లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. Unlimited Laughter. 😆Unlimited Entertainment. 😎Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025 -
జాతిరత్నాలు డైరెక్టర్ తో మాస్ కా దాస్ కామెడీ ఫిల్మ్
-
అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!
ముస్తాబు అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?! వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?! బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్‌గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి. అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్‌గా మారాయి. కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి. రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది. పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్‌లలో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్‌లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు... ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్‌క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్‌బ్రష్‌తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవి రింగులు గానూ, నెక్లెస్ ఎక్స్టెండర్స్గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్గానూ వాడచ్చు. ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి. బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు. ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్‌గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది. కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు: ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది.


