తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)
''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.
'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్‌గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది.
(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)
#Funky లో Romantic Scenes PEAKS లో ఉంటాయి... EXTREME అసలు..
రొమాంటిక్ Scenes లో #Anudeep చాలా UNCOMFORTABLE అయిపోయాడు!!
- #VishwakSen pic.twitter.com/DSigVrImla— Movies4u Official (@Movies4u_Officl) January 26, 2026


