సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..! | CBFC makes subtitles compulsory for all Indian films | Sakshi
Sakshi News home page

CBFC: సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!

Mar 14 2026 2:39 PM | Updated on Mar 14 2026 2:47 PM

CBFC makes subtitles compulsory for all Indian films

ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్‌ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా ‍‍అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో  ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..

సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ ‍అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు  ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్‌ బోర్డ్ స్పష్టం చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement