తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో | Sirai Movie OTT Telugu Version Streaming Now | Sakshi
Sakshi News home page

Sirai OTT: కంటతడి పెట్టించే మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Jan 26 2026 3:24 PM | Updated on Jan 26 2026 3:50 PM

Sirai Movie OTT Telugu Version Streaming Now

ఇప్పుడంతా ఓటీటీ జమానా. వివిధ భాషల సినిమాలని డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లలో అలా దక్షిణాది భాషల మూవీస్‌కి తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు అయిపోయారు. ఇకపోతే గత వీకెండ్ రిలీజైన ఓ తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఇప్పుడు కాస్త ఆలస్యంగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'సిరై'. తమిళంలో ఈ టైటిల్‌కి జైలు అని అర్థం. డిసెంబరులో థియేటర్లలోకి రిలీజైనప్పుడు అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. మూడు రోజుల క్రితం జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోలీస్ డ్రామా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.

'సిరై' విషయానికొస్తే.. శీను(విక్రమ్ ప్రభు) అనే పోలీస్, ఎక్కువగా ఎస్కార్ట్ డ్యూటీ చేస్తుంటాడు. ఎస్కార్ట్ అంటే ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం అనమాట. వృత్తిలో సిన్సియర్ అయిన ఇతడు ఓ రోజు అబ్దుల్ రౌఫ్(అక్షయ్ కుమార్) అనే ఖైదీని గుంటూరు జైలు నుంచి కడప కోర్టు వరకు తీసుకెళ్లాల్సిన ఎస్కార్ట్ పనిపడుతుంది. మరి ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. అబ్దుల్ గతమేంటి? ఇతడు ప్రేమించిన కళ (అనిష్మా) చివరకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement