తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.
'గత వారం నుంచి ఎల్‌సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్‌తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్‌సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'
(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)
'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను'
'అల్లు అర్జున్‌తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)
#LokeshKanagaraj about UpComing #LCU Film
- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026


