LCU
-
ఎల్సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్కమ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్ డీసీ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. Welcome to the universe @iam_RaviMohan sir 🤗🤗❤️❤️ #Benz @offl_Lawrence @nivinofficial @iamsamyuktha_ @Dir_Lokesh @PassionStudios_ @TheRoute @GSquadOffl @Sudhans2017 @Jagadishbliss @bakkiyaraj_k @SaiAbhyankkar pic.twitter.com/kxF51Vtb9Z— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 31, 2026 -
డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్మీట్లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.'గత వారం నుంచి ఎల్సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్‌తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను''అల్లు అర్జున్‌తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)#LokeshKanagaraj about UpComing #LCU Film- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026 -
ఎట్టకేలకు 'ఖైదీ' సీక్వెల్.. లేటెస్ట్ అప్డేట్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎల్సీయూ(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్)కి ఈ చిత్రంతోనే మూలం పడింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. అప్పుడుఇప్పుడు అంటూ నాన్చుతూ వస్తున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్లకు కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్)'మానగరం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీసినప్పుడు ఎలాంటి అంచనాల్లేవు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఓ యూనివర్స్ సృష్టించి.. లియో, విక్రమ్ చిత్రాలకు కనెక్షన్ ఇచ్చాడు. ఇందులో ఖైదీ 2, రోలెక్స్ మూవీస్ రావాల్సి ఉంది. కానీ లోకేశ్.. రజినీకాంత్‌తో 'కూలీ' తీశాడు. మరోవైపు ఆమిర్ ఖాన్‌తోనూ త్వరలో ఓ మూవీ తీస్తాడనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఖైదీ సీక్వెల్ ఇప్పట్లో రాదేమోనని అంతా అనుకున్నారు.కానీ 'ఖైదీ' చిత్రానికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే ఈరోజు (అక్టోబరు 25) నుంచి సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైపోయాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం లోకేశ్ తర్వాత సినిమా ఫిక్స్ అయినట్లే. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వార్తలు నిజమైతే గనక మరో రెండు మూడు నెలలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైపోవచ్చు. బహుశా దీని గురించి మంచి రోజు చూసుకుని ప్రకటిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు)


