ఎట్టకేలకు 'ఖైదీ' సీక్వెల్.. లేటెస్ట్ అప్‌డేట్ | Kaithi 2 Movie Pre Production Works Starts | Sakshi
Sakshi News home page

Kaithi 2: లోకేశ్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చినట్టేనా?

Oct 25 2025 3:22 PM | Updated on Oct 25 2025 3:42 PM

Kaithi 2 Movie Pre Production Works Starts

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎల్‌సీయూ(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్)కి ఈ చిత్రంతోనే మూలం పడింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. అప్పుడుఇప్పుడు అంటూ నాన్చుతూ వస్తున్నారు. ఏదైతేనేం ఇ‍న్నాళ్లకు కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్)

'మానగరం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీసినప్పుడు ఎలాంటి అంచనాల్లేవు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఓ యూనివర్స్ సృష్టించి.. లియో, విక్రమ్ చిత్రాలకు కనెక్షన్ ఇచ్చాడు. ఇందులో ఖైదీ 2, రోలెక్స్ మూవీస్ రావాల్సి ఉంది. కానీ లోకేశ్‌.. రజినీకాంత్‌తో 'కూలీ' తీశాడు. మరోవైపు ఆమిర్ ఖాన్‌తోనూ త్వరలో ఓ మూవీ తీస్తాడనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఖైదీ సీక్వెల్ ఇప్పట్లో రాదేమోనని అంతా అనుకున్నారు.

కానీ 'ఖైదీ' చిత్రానికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే ఈరోజు (అక్టోబరు 25) నుంచి సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైపోయాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం లోకేశ్ తర్వాత సినిమా ఫిక్స్ అయినట్లే. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వార్తలు నిజమైతే గనక మరో రెండు మూడు నెలలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైపోవచ్చు. బహుశా దీని గురించి మంచి రోజు చూసుకుని ప్రకటిస్తారేమో చూడాలి?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement