ఎల్‌సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్‌ గ్రాండ్ వెల్‌కమ్..! | Kollywood Star Jayam Ravi Joins In LCU Benz Movie, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Benz Movie: లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ హీరోకు గ్రాండ్ వెల్‌కమ్..!

May 31 2026 5:01 PM | Updated on May 31 2026 6:16 PM

Kollywood star Jayam Ravi Joins In LCU Benz Movie

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్‌సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్‌ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్‌ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్‌ పౌలీ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

మరోవైపు లోకేశ్ కనగరాజ్..  ఐకాన్ స్టార్‌ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్‌- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్  డీసీ అనే సినిమాతో  హీరోగా పరిచయం కాబోతున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement