ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్‌ కాదన్నాను: రాశీ | Raashi Khanna About Telusu Kada Movie Result | Sakshi
Sakshi News home page

Raashi Khanna: ఎక్కడో కొడుతుందన్నా.. స్క్రిప్ట్‌ అంతా మార్చేశారు

Mar 14 2026 2:34 PM | Updated on Mar 14 2026 2:50 PM

Raashi Khanna About Telusu Kada Movie Result

తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది. చివరగా తెలుగులో తెలుసు కదా మూవీతో అలరించింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.

సినిమా రిజల్ట్‌ ముందే ఊహించిన రాశీ
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించానంది. ఆమె మాట్లాడుతూ.. తెలుసు కదా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్‌ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్‌ కాదనిపిస్తుందన్నాను. అదే సమయంలో ఇది దర్శకుడి విజన్‌ అని గౌరవించాను. 

అదే నేర్చుకున్నా
కానీ, షూట్‌ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను.. ఇదెక్కడో కొడుతోంది, క్లైమాక్స్‌ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, కాబట్టి ఆపరేషన్‌ సీన్‌ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్‌ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్‌ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

Advertisement
 
Advertisement
Advertisement