Funky Movie: ఉర్రూతలూగించేలా ‘యమ యమ్మ’ పాట | Yama Yamma Video Song Out From Funky Movie | Sakshi
Sakshi News home page

Funky Movie: ఉర్రూతలూగించేలా ‘యమ యమ్మ’ పాట

Feb 9 2026 5:10 PM | Updated on Feb 9 2026 5:17 PM

Yama Yamma Video Song Out From Funky Movie

‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది.

భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించాడు. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.  విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన నృత్యరీతులతో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.

గీతావిష్కరణ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఫంకీ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు." అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement