'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్' | Rishab Shetty Special Wishes To Her Wife On Wedding Anniversary | Sakshi
Sakshi News home page

Rishab Shetty: 'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'

Feb 9 2026 4:06 PM | Updated on Feb 9 2026 4:16 PM

Rishab Shetty Special Wishes To Her Wife On Wedding Anniversary

కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్‌ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్‌తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్‌ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్‌ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.

రిషబ్ శెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. 

అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement