'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్‌తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్‌ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)