మూడేళ్ల క్రితం సెన్సేషన్ సృష్టించి, రీసెంట్‌గా మరోసారి పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేసిన హీరో రిషభ్ శెట్టి. 2022లో వచ్చిన 'కాంతార'తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కాంతార-1'తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. రూ.800 కోట్ల మార్క్ దాటి ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా రిషభ్.. కుందాపురలోని తన ఇంట్లో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకు రాగా అందులోని ఓ విషయం ఆసక్తికరంగా అనిపించింది.
వాటర్ క్యాన్ బిజినెస్‌తో కెరీర్ మొదలుపెట్టిన రిషభ్ శెట్టి.. తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. తొలుత దర్శకుడిగా, తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. అయితే 'కాంతార'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌తో వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్‌గా కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే రిషభ్ ఇంట్లో ఏకంగా ఐదు ఖరీదైన కార్లు ఉండటం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: మరో సీక్వెల్‌లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?)
రిషభ్ భార్య ప్రగతి శెట్టి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో వీళ్ల ఇల్లు అంతా క్లియర్‌గా చూడొచ్చు. అలానే ఆడీ క్యూ7, మహీంద్రా థార్, టయోటా వెల్ ఫైర్, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ తదితర కార్లు కూడా కనిపించాయి. దీంతో రిషభ్ దగ్గర చాలానే కార్లు ఉన్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కార్లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650 లాంటి కాస్ట్ లీ బైక్స్ కూడా రిషభ్ దగ్గర ఉన్నాయట.
రిషభ్ తర్వాత సినిమాల విషయానికొస్తే కొన్నాళ్ల పాటు దర్శకత్వం పక్కనబెట్టబోతున్నాడు. త్వరలో ప్రశాంత్ వర్మ తీయబోయే 'జై హనుమాన్' సెట్స్‌లో అడుగుపెడతాడు. ఇది కాకుండా ఛత్రపతి శివాజీ బయోపిక్, తెలుగులో సితార సంస్థలో ఓ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూడు పూర్తయ్యేసరికి 2028 అయిపోవచ్చు. తర్వాతే 'కాంతార ఛాప్టర్ 2' ఉండొచ్చేమో చూడాలి?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు)



ಬೆಳಕಿನ ಈ ಹಬ್ಬ, ಪ್ರೀತಿ ಹಂಚುವ ಸುಂದರ ಕ್ಷಣಗಳು..✨
A festival of lights, a lifetime of memories..
Grateful for family, love, and laughter this Deepavali..#Deepavali2025
1/2 pic.twitter.com/wL6WMXzsW4— Pragathi Rishab Shetty (@PragathiRShetty) October 25, 2025


