మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.


