రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్‌పై నటి కృతిక క్లారిటీ | Tv presenter Gaurav Kapoor Relation With Kritika Kamra | Sakshi
Sakshi News home page

Gaurav Kapoor: ఐపీఎల్ కామెంటరీతో ఫేమస్.. నటితో డేటింగ్

Dec 10 2025 2:51 PM | Updated on Dec 10 2025 3:02 PM

Tv presenter Gaurav Kapoor Relation With Kritika Kamra

స్వతహాగా టీవీ నటుడు అయినప్పటికీ ఐపీఎల్‌లో హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కపూర్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇతడి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది. గౌరవ్ ఎవరితోనైతే రిలేషన్‌లో ఉన్నాడని పుకార్లు వచ్చాయో సదరు నటి.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: అమ్మ ఆశీర్వదించింది.. భగవంతుడు నిజం చేశాడు: పూర్ణ)

రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన గౌరవ్ కపూర్.. కొన్ని హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కాకపోతే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో హోస్ట్‌గా చేసిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అలా 2017 వరకు ఈ లీగ్‌లో హోస్టింగ్ చేశాడు. ప్రస్తుతం క్రిక్‌బజ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యతగా పనిచేస్తున్నాడు.

గతంలోనే నటి కిరాట్ బట్టల్‌ అనే నటిని గౌరవ్, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా గౌరవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కృతిక కమ్రా అనే నటితో గౌరవ్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కృతికనే ఇన్ స్టాలో గౌరవ్‌తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో బంధం అధికారికం చేసేశారని మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల కృతిక ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్‌.. చాలా బాధపడ్డా!: నటి ప్రగతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement