బిగ్‌బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్‌లో కూడా అదే జరగుతోంది.
టాప్ 2పై ట్రోలింగ్
కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు.
వేరేవాాళ్లను తొక్కితేనే..
అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.
కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?
బిగ్‌బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.
ఐపీఎల్‌లో ఇలాంటివేం లేదే
ఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్‌బాస్ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్‌లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..
గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్
ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.
గేమ్ పక్కట్టి..
కానీ, సోషల్‌మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తు;weన్నాయి. గత సీజన్‌లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు.
ఇదేం బాగోలేదు
కేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్‌లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు.
Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮
Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025


