తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే ఉంది. అయితే తనూజ కన్నడ అమ్మాయి అని ట్రోల్ చేస్తుంటే పవన్ కల్యాణ్ పడాల అసలు ఆర్మీ జవానే కాదని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఇండియన్ ఆర్మీలో లేడని సీఆర్‌పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీస్ దళం) అని ఓ సుందర్ అనే జవాన్ ఓ వీడియో చేశారు.
కల్యాణ్ ఫ్రెండ్ క్లారిటీ
అంతేకాకుండా కల్యాణ్ బయటకు వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి అతడిని విధుల నుంచి కూడా తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఫ్రెండ్, సీఆర్‌పీఎఫ్ పోలీస్ మణికంఠ స్పందించాడు. కల్యాణ్ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్ తీసుకునే బిగ్‌బాస్‌కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు.
కల్యాణ్‌ను తొలగించలేదు
మాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవాలన్నా సరే.. సోల్జర్‌ను తొలగించడం అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. పవన్ కల్యాణ్.. మొదట్లో తాను ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. కానీ ఈ జర్నీలో తనెప్పుడూ సోల్జర్ అని చెప్పి, ఓట్లేయమని అడుక్కోలేదు.
నాగార్జున అడిగితేనే..
బిగ్‌బాస్ షోలో తన గేమ్, ప్రవర్తన చూసి ఓట్లేయండి. అతడెప్పుడూ సోల్జర్ అని చెప్పి సింపతీ కార్డు ఉపయోగించలేదు. నాగార్జున సార్.. కల్యాణ్, ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగాడు. అప్పుడు మాత్రమే కల్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతే తప్ప అందులో ఏం లేదు. తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు అని పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ టీమ్ అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
యూటర్న్
అలాగే కల్యాణ్ (Pawan Kalyan Padala)ను విమర్శించిన ఎస్‌జే సుందర్ అనే జవాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ అయినా, సీఆర్‌పీఎఫ్ అయినా, ఏ డిఫెన్స్ ఫోర్స్ అయినా.. చేసేది దేశసేవే. వన్స్ ఎ సోల్జర్.. ఆల్‌వేస్ సోల్జర్. వీలైతే గెలిపించండి అని వీడియో చేశారు. మొత్తానికి ఈ రెండు వీడియోలతో కల్యాణ్‌పై వివాదానికి ఫుల్‌స్టాప్ పడి, నెగెటివిటీ తగ్గుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా సీఆ్‌పీఎఫ్.. దేశ అంత్గత భద్రతను కాపాడుతుంది. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్‌ను వినియోగిస్తారు.


