'అఖండ 2' ఎఫెక్ట్.. రోజు ఆలస్యంగా 'మోగ్లీ' రిలీజ్ | Mowgli 2025 Telugu Movie Release Date | Sakshi
Sakshi News home page

Mowgli 2025: చెప్పిన తేదీకే వస్తున్నారు కానీ చిన్న మార్పు

Dec 10 2025 11:55 AM | Updated on Dec 10 2025 11:55 AM

Mowgli 2025 Telugu Movie Release Date

గతవారం థియేటర్లలోకి రావాల్సిన 'అఖండ 2' సినిమా అకస్మాత్తుగా వాయిదా పడింది. దీనికి కారణం నిర్మాతల చేసిన కోట్ల రూపాయల అప్పు. ఎట్టకేలకు దాన్ని సెటిల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం (డిసెంబరు 12) మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా జరగడంతో ఈ వారం థియేటర్లలోకి వద్దామనుకున్నా చిత్రాల పరిస్థితి తారుమారైంది. కొన్ని మూవీస్ వాయిదా పడ్డాయి.

(ఇదీ చదవండి: ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా.. 'ఆ' సెంటిమెంట్)

కానీ కార్తీ 'అన్నగారు వస్తారు'.. తెలుగు, తమిళంలో ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు యాంకర్ సుమ కొడుకు లేటెస్ట్ మూవీ 'మోగ్లీ' విడుదల విషయంలో మాత్రం ప్లాన్ మారింది. లెక్క ప్రకారం శుక్రవారమే రావాల్సి ఉంది. కానీ అదే రోజున ప్రీమియర్లు పడతాయని, శనివారం (డిసెంబరు 13) రెగ్యులర్ రిలీజ్ ఉంటుందని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అంటే 'అఖండ 2' ఎఫెక్ట్ వల్ల ఓ రోజు ఆలస్యంగా 'మోగ్లీ' థియేటర్లలోకి రానున్నాడు.

'కలర్ ఫోటో' తీసిన సందీప్ రాజ్.. 'మోగ్లీ'కి దర్శకత్వం వహించాడు. సుమ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. సాక్షి అనే అ‍మ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. బండి సరోజ్ కుమార్ విలన్‌గా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సాధారణంగా అయితే కాస్త బజ్ ఉండేది. మరి 'అఖండ 2'తో పోటీలో ఉంది కాబట్టి ఫలితం ఏమవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement