కార్తీ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘అన్నగారు వస్తారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్స్ బాబీ(కేఎస్ రవీంద్ర), వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీంద్రన్, శైలేష్ కొలను, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథులుగా హాజరై, ‘అన్నగారు వస్తారు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.


