నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్‌ భార్య | Radhika Pandit Shares Heartwarming Special Video For Yash On The Occasion Of 9th Wedding Anniversary, Video Went Viral | Sakshi
Sakshi News home page

నా భర్త నా బాడీగార్డ్‌ మాత్రమే కాదు! వీడియో షేర్‌ చేసిన యష్‌ భార్య

Dec 10 2025 10:14 AM | Updated on Dec 10 2025 10:22 AM

Radhika Pandit 9th Wedding Anniversary post to Yash

కన్నడ స్టార్‌ హీరో యష్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్‌ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ  అద్భుతమైన  వీడియో షేర్‌ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్‌ వచ్చింది. 

అతడే నా సర్వస్వం
ఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్‌ బాడీగార్డ్‌, నా చాట్‌జీపీటీ, నా చెఫ్‌, నా పర్సనల్‌ ఫోటోగ్రాఫర్‌, నా మెంటార్‌, నా డీజే, నా డాక్టర్‌, నా కాలిక్యులేటర్‌, నా స్ట్రెస్‌ బస్టర్‌ అంటూ యష్‌ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్‌ ఫోటోను యాడ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ మ్యాన్‌ అని యష్‌ను కొనియాడుతున్నారు.

సినిమా
కేజీఎఫ్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్‌ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్‌ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement