∙హర్ష, ఈషా రెబ్బా
ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలంతా ఒకే దగ్గర రెంట్‌కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా చేసే కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం వంటి అంశాలు సీజన్ 2లో కనిపిస్తాయి. ఇది నా కెరీర్‌లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్.
ఇక నా తర్వాతి చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. అలాగే విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. హర్ష మాట్లాడుతూ– ‘‘సీజన్ 1లోని పగను సీజన్ 2లో తీర్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ప్రభాస్‌గారి ‘ది రాజా సాబ్’లో చిన్న రోల్ చేశాను. అలాగే ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న అన్ని సినిమాల్లోనూ, ‘మోగ్లీ 2025’లోనూ మంచి రోల్స్ చేశాను. నేను లీడ్ రోల్‌లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి’’ అని చెప్పారు.


