breaking news
3 Roses Series
-
'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఇది: ఈషా రెబ్బా
ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలంతా ఒకే దగ్గర రెంట్‌కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా చేసే కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం వంటి అంశాలు సీజన్ 2లో కనిపిస్తాయి. ఇది నా కెరీర్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్.ఇక నా తర్వాతి చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. అలాగే విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. హర్ష మాట్లాడుతూ– ‘‘సీజన్ 1లోని పగను సీజన్ 2లో తీర్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ప్రభాస్‌గారి ‘ది రాజా సాబ్’లో చిన్న రోల్ చేశాను. అలాగే ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న అన్ని సినిమాల్లోనూ, ‘మోగ్లీ 2025’లోనూ మంచి రోల్స్ చేశాను. నేను లీడ్ రోల్లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి’’ అని చెప్పారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ 'అన్నగారు వస్తారు'.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్లో రెమ్యునరేషన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1'తో పాటు త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ ఉన్నంతలో చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 08మ్యాన్ vs బేబీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12హాట్స్టార్సూపర్మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 11అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 08ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12ఆహా3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12జీ5సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12సన్ నెక్స్ట్అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12సోనీ లివ్రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ సిరీస్) - డిసెంబరు 09ఆపిల్ టీవీ ప్లస్ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12మనోరమ మ్యాక్స్ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12(ఇదీ చదవండి: ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చేసిన అలనాటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం) -
లెక్చరర్‌తో ప్రేమ.. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు: రాశీ సింగ్
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2లో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. డిసెంబర్ 12న ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం మొదలు పెట్టింది. అయితే, రాశీ సింగ్ తన కాలేజ్ రోజుల నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఏకంగా తన లెక్చరర్‌తో ఉన్న రిలిలేషన్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.రాశీ సింగ్ ఇలా చెప్పారు 'స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీలో చేరాను. ఆ సమయంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మాకు లెక్చరర్ కూడా.. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్ చేసేవాడు. పరీక్షలు ఉన్నప్పుడు ఎగ్జామ్ పేపర్లు కూడా నాకు ముందే ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. సరదాగా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం. ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు.. అతను కూడా చాలా యంగ్.. పెళ్లి కూడా కాలేదు. అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఫాలో అవుతుంది.' అని రాశీ సింగ్ చెప్పారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించాను. ఆయన నాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేవారు, వైవాలో ఏమి అడిగేవారు కాదు, దాని బదులు మేమిద్దరం టైమ్ పాస్ చేసుకున్నాం. - Rashi Singh#3Roses Season2 pic.twitter.com/sQYQaSihSi— idlebrain.com (@idlebraindotcom) December 7, 2025 -
చీరకట్టులో కేక పెట్టించిన కుషిత కల్లపు లేటెస్ట్ (ఫొటోలు)
-
వినోదాల త్రీ రోజెస్
ఈషా రెబ్బా, రాశీ సింగ్, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. రవి నంబూరి, సందీప్ బొల్ల రచనలో కిరణ్ కె. కరవల్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2 డిసెంబరు 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ టీజర్‌లాంచ్ ఈవెంట్లో కిరణ్ కె. కరవల్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌గా నా డెబ్యూ సిరీస్ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందింది’’ అని తెలిపారు.ఎస్ కేఎన్ మాట్లాడుతూ– ‘‘త్రీ రోజెస్’ కాన్సెప్ట్‌తో ఎన్ని సిరీస్‌లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్‌ని మారుతి ఇచ్చారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 1ను మించిన ఎంటర్టైన్మెంట్ సీజన్ 2లో చూస్తారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 3 కూడా ఉంటుంది.. ఆ సీజన్‌ను సినిమాలా రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘త్రీ రోజెస్’ సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు.సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే మొదటి దానికంటే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘ఈ సిరీస్‌లో నేను చేసిన మేఘనపాత్రకి, నా పర్సనల్ లైఫ్‌కు చాలా పోలికలు ఉన్నాయి’’ అని రాశీ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఈ సిరీస్‌లో నేను చేసిన స్రష్టి క్యారెక్టర్‌కు కొంచెం తిక్క ఉంది, కానీ దానికి ఓ లెక్క ఉంటుంది’’ అన్నారు కుషిత కల్లపు. ఈ కార్యక్రమంలో ఆహా కమర్షియల్ హెడ్ రాజేశ్ వాసిరెడ్డి, కంటెంట్ హెడ్ కవిత, రైటర్ సందీప్ బొల్ల, యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడారు. -
ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్
కరోనా టైంలో పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేరుగా ఓటీటీల్లో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'త్రీ రోజెస్' ఒకటి. 2021లో ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అయింది. బోల్డ్ కంటెంట్, దానికి తోడు రొమాంటిక్ కామెడీతో దీన్ని తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)వచ్చే నెల 12 నుంచి ఆహా ఓటీటీలో '3 రోజెస్' రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ లాంచ్ చేశారు. ఈసారి కూడా ఈషా రెబ్బా ఉండగా.. పాయల్, పూర్ణకి బదులు రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషిత కొత్తగా వచ్చి చేరారు. టీజర్లో అయితే అడల్ట్ టచ్ ఉన్న జోక్స్, సీన్స్ కనిపించాయి. సిరీస్‌లోనూ వీటితో పాటు రొమాంటిక్ కామెడీ ఉండనుంది. (ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)


