ఎస్‌కేఎన్, ఈషా రెబ్బా, రాశీ సింగ్, ప్రిన్స్ సిసిల్, కుషిత, కిరణ్
ఈషా రెబ్బా, రాశీ సింగ్, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. రవి నంబూరి, సందీప్ బొల్ల రచనలో కిరణ్ కె. కరవల్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2 డిసెంబరు 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ టీజర్‌లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ కె. కరవల్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌గా నా డెబ్యూ సిరీస్ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందింది’’ అని తెలిపారు.
ఎస్ కేఎన్ మాట్లాడుతూ– ‘‘త్రీ రోజెస్’ కాన్సెప్ట్‌తో ఎన్ని సిరీస్‌లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్‌ని మారుతి ఇచ్చారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 1ను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ సీజన్ 2లో చూస్తారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 3 కూడా ఉంటుంది.. ఆ సీజన్‌ను సినిమాలా రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘త్రీ రోజెస్’ సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు.
సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే మొదటి దానికంటే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘ఈ సిరీస్‌లో నేను చేసిన మేఘనపాత్రకి, నా పర్సనల్ లైఫ్‌కు చాలా పోలికలు ఉన్నాయి’’ అని రాశీ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఈ సిరీస్‌లో నేను చేసిన స్రష్టి క్యారెక్టర్‌కు కొంచెం తిక్క ఉంది, కానీ దానికి ఓ లెక్క ఉంటుంది’’ అన్నారు కుషిత కల్లపు. ఈ కార్యక్రమంలో ఆహా కమర్షియల్ హెడ్ రాజేశ్ వాసిరెడ్డి, కంటెంట్ హెడ్ కవిత, రైటర్ సందీప్ బొల్ల, యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడారు.


