ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఫుల్ క్రేజ్ ఉంది. అలా వచ్చి నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ మరో సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడుస్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5 కూడా వచ్చేస్తోంది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5లోని 5,6,7 ఎపిసోడ్‌లు డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులోని చివరి ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 2022లో రిలీజైన సీజన్-4 అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌గా నిలిచింది. దీంతో ఈ సిజన్‌పై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు రాస్ డఫర్ దర్శకత్వం వహించారు.
Hitman aa raha hai upside down ko seedha karne ❤️🔥
Watch Stranger Things 5: Volume 2, out 26 December at 6:30 AM IST, only on Netflix.#Collab pic.twitter.com/V9F1B4izDM— Netflix India (@NetflixIndia) December 23, 2025


