breaking news
Stranger Things
-
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట్రేంజర్ థింగ్స్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలియని వాళ్లకు దీని గురించి వివరించాలంటే ఇదో ఫాంటసీ థ్రిల్లర్ అడ్వెంచరస్ సిరీస్. 2016లో మొదలై 2026లో ముగిసింది. న్యూఇయర్ సందర్భంగా చిట్టచివరి ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుంది? ఎందులో చూడొచ్చు? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్ స్కామ్‌పై వెబ్ సిరీస్.. విడుదలకు లైన్ క్లియర్)కథేంటి?అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో అందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతారు. పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. విలియమ్ అలియాస్ విల్ మాత్రం కనిపించకుండా పోతాడు. ఇంతకీ విల్ ఏమయ్యాడు? మరోవైపు ఫ్రెండ్ కోసం వెతుకుతుండగా.. మిగిలిన ముగ్గురు పిల్లలకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతమేంటి? విల్ని కనిపెట్టడంలో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలు చూడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2-3 గంటల్లో ఇవి ముగిసిపోతాయి. కాకపోతే కొన్నేళ్లుగా పెరిగిన ఓటీటీ కల్చర్ వల్ల పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనకు పరిచయమయ్యాయి. అలాంటి వాటిలోని ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. తెలుగు ప్రేక్షకుల్లో దీన్ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే 2016 నుంచి ఇది సీజన్ల వారీగా స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. లాక్డౌన్ టైంలో దీనికి మన దేశంలోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది.ఇదో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్. ఓ చిన్న గ్రామంలో నలుగురు పిల్లలకు ఓ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి స్నేహం ఏర్పడితే తర్వాత ఏమైందనేదే స్టోరీ లైన్. కాకపోతే పిల్లాడు తప్పిపోవడంతో మొదలయ్యే ఈ సిరీస్.. తర్వాత అనుహ్యమైన మలుపులు, అద్భుతమైన సన్నివేశాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మర్చిపోలేని పాత్రలు.. ఇలా ప్రతి దశలోనూ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యాలా ఉండటం ఈ సిరీస్ స్పెషాలిటీ.పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో మొత్తంగా 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాల పాటు ఉంటుంది. నాలుగో సీజన్లో మాత్రం ఎపిసోడ్ యావరేజ్ గంట 10 నిమిషాలు. రీసెంట్గా రిలీజైన ఐదో సీజన్లోనూ ఒక్కో ఎపిసోడ్ గంటకు పైనే నిడివితో ఉంటుంది. జనవరి 1న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఫినాలే ఎపిసోడ్ అయితే ఏకంగా 2 గంటలు ఉంది.మిగిలిన సిరీస్‌ల కంటే 'స్ట్రేంజర్ థింగ్స్' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం స్టోరీ చెప్పిన విధానం. ఇందులో డార్క్ హారర్ ఎలిమెంట్స్, ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు కొదవలేదు. తొలి మూడు సీజన్లలో హారర్ అంశాలు ఓ రేంజులో ఉంటే నాలుగో సీజన్లో అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్స్ అనే కాదు సౌండ్, పాత్రలు, నిర్మాణ విలువలు ఒకటేమిటి ఇలా సిరీస్‌లోని ప్రతి అంశం ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా విలన్ వెక్నా, మైండ్ ఫ్లయిర్ని చూస్తే భయమేస్తుంది.ఈ సిరీస్ అంతా కూడా 80ల్లో జరుగుతుంది. అందుకు తగ్గట్లే అప్పటి పరిస్థితులు, దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ.5000-6000 కోట్ల పైనే ఉంటుంది! వ్యూస్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ బూతులు ఎక్కువ. వీలైతే ఇంగ్లీష్ వెర్షన్లోనే చూడండి. ఈ సిరీస్‌ని మీరు ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే అయిపోయేంతవరకు అస్సలు ఆపరు.గత నెలరోజుల్లో చిట్టచివరిదైన ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు. తొలి నాలుగు సీజన్లు వావ్ అనేలా ఉంటాయి. చివరి దానిలో మాత్రం వావ్ ఫ్యాక్టర్స్ కంటే వీలైనంత ఎమోషనల్ కంటెంట్ ఉండేలా దర్శకద్వయం ఢప్పర్ బ్రదర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్‌కి ఎలాంటి ముగింపు ఇస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ చాలా సింపుల్‌గా తేల్చేయడం ఈ సిరీస్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ప్రస్తుతానికైతే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎలెవన్ పాత్ర చనిపోయిందా? బతికుందా అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.ఐదో సీజన్లలో ఈ సిరీస్‌ని ముగించారు. కానీ దీనికి 'స్పిన్ ఆఫ్' ఉంటుందని దర్శకద్వయం చెప్పుకొచ్చారు. దీని పేరు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే పెడతామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన సిరీస్ 1980ల్లో హాకిన్స్ అనే ఊరిలో జరిగింది. స్పిన్ ఆఫ్‌లో భాగంగా ప్రస్తుత కాలంలో మరో ఊరిలో జరిగే కథతో కొత్త సిరీస్ తీయబోతున్నారు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో) -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్‌లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)ఐదో సీజన్లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్లో ఎమోషన్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్) -
కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్లోనే కొత్త ఏడాది రాబోతుంది. అందుకు తగ్గట్లే న్యూఇయర్ సందర్భంగా థియేటర్లలోకి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఎకో అనే మలయాళ డబ్బింగ్ చిత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ అద్భుతమైన హిట్ కావడంతో కొందరు తెలుగు ఆడియెన్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. హక్ అనే హిందీ మూవీతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్, ఎల్బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు)నెట్ఫ్లిక్స్మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 31స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01హక్ (హిందీ మూవీ) - జనవరి 02అమెజాన్ ప్రైమ్సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) - డిసెంబరు 29సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02హాట్స్టార్ఎల్బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01సన్ నెక్స్ట్ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01(ఇదీ చదవండి: ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్) -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఫుల్ క్రేజ్ ఉంది. అలా వచ్చి నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ మరో సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడుస్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5 కూడా వచ్చేస్తోంది.స్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5లోని 5,6,7 ఎపిసోడ్లు డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులోని చివరి ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 2022లో రిలీజైన సీజన్-4 అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌గా నిలిచింది. దీంతో ఈ సిజన్పై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు రాస్ డఫర్ దర్శకత్వం వహించారు. Hitman aa raha hai upside down ko seedha karne ❤️🔥Watch Stranger Things 5: Volume 2, out 26 December at 6:30 AM IST, only on Netflix.#Collab pic.twitter.com/V9F1B4izDM— Netflix India (@NetflixIndia) December 23, 2025 -
2025కి ముగింపు.. ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు
2025 చివరకొచ్చేసింది. మరోవారం పదిరోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. దీంతో ఈ వీకెండ్ బోలెడన్ని మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఛాంపియన్, దండోరా, శంబాల, ఈషా, పతంగ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు వృషభ, బ్యాడ్ గర్ల్జ్, మార్క్, అనకొండ(హాలీవుడ్) తదితర డబ్బింగ్ మూవీస్ ఈ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లో మంచి కంటెంట్ రాబోతుంది.(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?)ఓటీటీల్లో ఈ వీకెండ్.. రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివ్వాల్వర్ రీటా', ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2'.. ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 22 నుంచి 28 వరకు)నెట్ఫ్లిక్స్పోస్ట్హౌస్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 22గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 24ప్యారడైజ్ (మలయాళ చిత్రం) - డిసెంబరు 24ఆంధ్ర కింగ్ తాలుకా (తెలుగు సినిమా) - డిసెంబరు 25రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 26స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 26హాట్స్టార్నోబడీ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22అమడస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22ద బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22జీ5మిడిల్ క్లాస్ (తమిళ సినిమా) - డిసెంబరు 24రోంకిని భవన్ (బెంగాలీ సిరీస్) - డిసెంబరు 25ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ మూవీ) - డిసెంబరు 26సన్ నెక్స్ట్నిధియం భూతవుం (మలయాళ సినిమా) - డిసెంబరు 24అమెజాన్ ప్రైమ్సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22టుగెదర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ సిరీస్) - డిసెంబరు 22ఐ విస్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22యానివర్సరీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22(ఇదీ చదవండి: Bigg Boss 9 Telugu: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, మరి ముగింపు?) -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. 2016 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. గత నెలలోనే ఐదో సీజన్ తొలి వాల్యూమ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అద్భుతమైన రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్)అమెరికాలోని హాకిన్స్ అనే ఓ పల్లెటూరిలో నలుగురు ఫ్రెండ్స్(అబ్బాయిలు) ఉంటారు. ఓ రోజు రాత్రి వీళ్లకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? వీళ్ల ఐదుగురితో పాటు మరికొందరు కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తి నుంచి తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. అయితే ఎలెవన్ అనే అమ్మాయికి ఇప్పటివరకు పవర్స్ ఉండగా.. నలుగురు పిల్లల్లోని విల్ అనే అబ్బాయికి కూడా పవర్స్ వచ్చినట్లు చూపించి ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌ని ముగించారు. రెండో వాల్యూమ్‌లో ఎలెవన్, విల్, నం.8 కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తులున్న విలన్ని ఎలా ఎదిరిస్తాయనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్‌లో ఉంది.(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా', ధనుష్ 'అమర కావ్యం' లాంటి పెద్ద సినిమాలతో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా! లాంటి తెలుగు చిన్న మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. ఉన్నంతలో రామ్ మూవీపై మాత్రమే కాస్తోకూస్తో హైప్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 15 వరకు సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో ఆర్యన్, శశివదనే చిత్రాలు కొద్దో గొప్పో చూసే లిస్టులో ఉండగా.. ఈ వీకెండ్లో రవితేజ 'మాస్ జాతర' కూడా స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తుంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ 'సన్నీ సంస్కారీ కీ తులసి' కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 24 నుంచి 30వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 26జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 26సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) - నవంబరు 27మాస్ జాతర (తెలుగు మూవీ) - నవంబరు 27 (రూమర్ డేట్)ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 28లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ) - నవంబరు 28హాట్స్టార్బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28అమెజాన్ ప్రైమ్వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబరు 24 (రెంట్ విధానం)జీ5రేగాయ్ (తమిళ సిరీస్) - నవంబరు 28ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) - నవంబరు 28రక్తబీజ్ (బెంగాలీ మూవీ) - నవంబరు 28సన్ నెక్స్ట్శశివదనే (తెలుగు సినిమా) - నవంబరు 28ఆపిల్ టీవీ ప్లస్ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26వండ్‌లా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26లయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన దగ్గర కూడా బాగానే ఫేమస్. సూపర్ హీరో అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే నాలుగు సీజన్లు వచ్చాయి. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ నెలలో చివరిదైన ఐదో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇంతలోనే ఇందులో లీడ్ రోల్ చేసిన నటి.. సహనటుడిగా చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.ఈ సిరీస్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, ఎలెవన్ అనే పాత్ర చేయగా.. డేవిడ్ హార్బర్, జిమ్ హాపర్ అనే పోలీస్ రోల్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించారు. కానీ నిజజీవితంలో మాత్రం మిల్లీని డేవిడ్ వేధించడంతో పాటు ఏడిపించాడట కూడా. ఇదంతా కూడా ఐదో సీజన్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగిందని మిల్లీ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయమై నెట్‌ఫ్లిక్స్ సంస్థ దర్యాప్తు చేస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే)షూటింగ్ టైంలో ఈ వేధింపులు జరగడంతో చాన్నాళ్ల క్రితమే మిల్లీ, డేవిడ్‌పై ఫిర్యాదు చేసిందని.. తర్వాత నెలల పాటు విచారణ సాగుతూనే ఉందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సిరీస్ చివరి సీజన్ రిలీజ్ మరికొద్ది రోజులు ఉందనగా ఇదంతా బయటకు రావడం నటి అభిమానులకు షాకింగ్ అనిపించింది.చివరిదైన ఐదో సీజన్ విషయానికొస్తే.. రీసెంట్‌గానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31న ఫైనల్ సీజన్‌కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ విడతలవారీగా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ) -
ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ కూడా ఉంటారు. వాళ్లలో చాలామందికి నచ్చే సిరీస్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. తొలుత రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండేది. కానీ తర్వాత కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ చివరి సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తేదీలని ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)ఇప్పటికే నాలుగు సీజన్లు రాగా వేటికవే అదరగొట్టేశాయి. 2022లో చివరగా నాలుగో సీజన్ రిలీజైంది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా ఈ సిరీస్ ఫ్యాన్ బాగానే ఎదురుచూస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తెరదించుతూ కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ తేదీల్ని అధికారికంగా ప్రకటించారు. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31వ తేదీల్లో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఎలెవన్ అనే అమ్మాయి.. ఈ నలుగురి కంట పడుతుంది. కొన్నిరోజులకే వీళ్లంతా స్నేహితులు అయిపోతారు. అయితే తమతో ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి సూపర్ పవర్స్ ఉన్నాయనీ ఈ పిల్లలకు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి తమ ఊరికి ఎదురైన ప్రమాదాల్ని ఎలా ఆపగలిగారు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్) -
ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్
గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్‌లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'స్ట్రేంజర్ థింగ్స్'. నెట్‌ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్‌ల్లో ఇది కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న 'వాల్యూమ్ 1', క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న 'వాల్యూమ్ 2', న్యూఇయర్ కానుకగా జనవరి 1న 'ఫైనల్ ఎపిసోడ్' స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్‌గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) -
OTTలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు!
ఓటీటీ అనగానే చాలామంది థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తారు. సబ్స్క్రిప్షన్ వృథాగా పోకుండా మంచి సినిమాలన్నీ చూసేయాలనుకుంటారు. కొత్తగా రిలీజయ్యే వాటిని ఎలాగోలా చూస్తారు. కానీ, అవైపోయాక ఏం చేయాలో అర్థం కాదు. ఇందుకోసం ఓటీటీలో టాప్ సినిమాల జాబితా కోసం గూగుల్‌లో వెతికేస్తారు. అలాంటివారికోసమే నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాను ఇక్కడ పొందుపరిచాం. నెట్‌ఫ్లిక్స్‌లో.. ఇవి బాగుంటాయ్ అని చెప్పుకునే సినిమాలు బోలెడు. వాటిలో ఓ పది చిత్రాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూసేయండి..డామ్సెల్ఒక యువరాణి తన రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు ఓ గాయపడ్డ డ్రాగన్‌ను కనుగొంటుంది. దానితో ఆమెకు మంచి స్నేహం కుదురుతుంది. ఈ స్నేహితులు ఏం చేశారన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే!ద విచ్ఒక ఫ్యామిలీ అడవిలోని ఓ ప్రదేశంలో తమకంటూ ఓ ఇల్లు నిర్మించుకుని ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ భయాన సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన్నారా? లేదా? వీరు దెయ్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారా? అన్నది తెలియాలంటే ద విచ్ చూడాల్సిందే!ట్రైన్ టు బూసన్దక్షిణ కొరియాలో జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో ఓ రైలులో మనుషులు ఉన్నట్లుండి జాంబీలుగా మారిపోతారు. మరి అందులోని హీరో కుటుంబం వీరి బారి నుంచి సురక్షితంగా బయపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ!వెరోనికాసరదా ఆటలు కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారతాయి. ఓ టీనేజ్ అమ్మాయి ఊజా బోర్డుతో గేమ్ ఆడుతుంది. దాంతో దెయ్యం ఆమె వెంటపడుతుంది. తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.బర్డ్ బాక్స్ఒక శక్తి.. తన కంటిచూపుతో జనాల్ని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో వారు కళ్లకు గంతలు కట్టుకుని నది దాటే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్లు గండం గట్టెక్కారా? లేదా? అనేది తెలియాలంటే బర్డ్ బాక్స్ చూడాల్సిందే!ఫ్రాక్చర్డ్యాక్సిడెంట్ తర్వాత ఓ జంట ఆస్పత్రిలో చేరుతుంది. తీరా చూస్తే తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఆస్పత్రిలోనే ఏదో జరుగుతోందని హీరో కనుగొంటాడు. తన భార్య, కూతురిని తిరిగి కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.స్ట్రేంజర్ థింగ్స్మనకు తెలియని ప్రపంచం మరోటి ఉందని పిల్లలు కనుగొంటారు. ఆ మరో ప్రపంచంలోని రాక్షస జీవులతో పోరడతారు. అదృశ్య శక్తులున్న ఓ అమ్మాయి ఆ రాక్షస జీవులతో పోరాడేందుకు సాయం చేస్తుంది. ఇప్పటికి ఈ వెబ్ సిరీస్ నాలుగు సీజన్లు వచ్చింది. త్వరలో ఐదో సీజన్ రాబోతోంది.ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్అమెరికన్ రచయిత ఎడ్గర్ అల్లన్ పో ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ అనే కథ రాశాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఓ కుటుంబాన్ని దెయ్యం వెంటాడుతూ ఉంటుంది.. ఒంట్లో వణుకు పుట్టించే సిరీస్ ఇది.ట్రూత్ ఆర్ డేర్మనలో చాలామంది ఆడుకునే సరదా ఆట ఇది. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. కానీ ఎవరైనా అబద్ధం చెప్పారంటే ఓ శక్తి వారిని దారుణంగా శిక్షిస్తుంటుంది. ఆటను మధ్యలో వదిలేసినవారిని చంపడానికి కూడా వెనుకాడదు.మెరైన్ఓ అమ్మాయి హారర్ కథలు రాస్తుంటుంది. నెమ్మదిగా అవన్నీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ సిరీస్ హారర్ ప్రియులను కచ్చితంగా మెప్పిస్తుంది.చదవండి: మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్ -
20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి
సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‌తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్‌తో రిలేషన్లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.అయితే సడన్‌గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్‌గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)


