2025కి ముగింపు.. ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు | Upcoming OTT Movies Telugu December Last Week 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో 19 మూవీస్.. మరి థియేటర్లలో?

Dec 22 2025 12:21 PM | Updated on Dec 22 2025 1:01 PM

Upcoming OTT Movies Telugu December Last Week 2025

2025 చివరకొచ్చేసింది. మరోవారం పదిరోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. దీంతో ఈ వీకెండ్ బోలెడన్ని మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఛాంపియన్, దండోరా, శంబాల, ఈషా, పతంగ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు వృషభ, బ్యాడ్ గర్ల్జ్, మార్క్, అనకొండ(హాలీవుడ్) తదితర డబ్బింగ్ మూవీస్ ఈ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లో మంచి కంటెంట్ రాబోతుంది.

(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్‌లో ఈ కోణం ఉందా?)

ఓటీటీల్లో ఈ వీకెండ్.. రామ్ '​ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివ్వాల్వర్ రీటా', ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2'.. ఈ వీకెండ్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రానున్నాయంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 22 నుంచి 28 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • పోస్ట్‌హౌస్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 22

  • గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 24

  • ప్యారడైజ్ (మలయాళ చిత్రం) - డిసెంబరు 24

  • ఆంధ్ర కింగ్ తాలుకా (తెలుగు సినిమా) - డిసెంబరు 25

  • రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 26

  • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 26

హాట్‌స్టార్

  • నోబడీ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22

  • ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22

  • అమడస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

  • ద బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22

జీ5

  • మిడిల్ క్లాస్ (తమిళ సినిమా) - డిసెంబరు 24

  • రోంకిని భవన్ (బెంగాలీ సిరీస్) - డిసెంబరు 25

  • ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ మూవీ) - డిసెంబరు 26

సన్ నెక్స్ట్

  • నిధియం భూతవుం (మలయాళ సినిమా) - డిసెంబరు 24

అమెజాన్ ప్రైమ్

  • సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

  • టుగెదర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22

  • మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ సిరీస్) - డిసెంబరు 22

  • ఐ విస్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22

  • యానివర్సరీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22

(ఇదీ చదవండి: Bigg Boss 9 Telugu: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, మరి ముగింపు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement