breaking news
Andhra King Taluka Movie
-
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అప్డేట్
స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్.. మాస్ పక్కనబెట్టేశాడు. క్లాస్ సినిమా చేశాడు. అదే 'ఆంధ్ర కింగ్ తాలుకా'. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్. ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు.ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ 'మాస్ జాతర', తేజ సజ్జా 'మిరాయ్', అనుష్క 'ఘాటీ', పవన్ కల్యాణ్ 'ఓజీ', రిషభ్ శెట్టి 'కాంతార' తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు: డిస్కో శాంతి) అయితే 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి 'రాజాసాబ్' రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి 'అఖండ 2' రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు.'ఆంధ్ర కింగ్ తాలుకా' చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్)Dear MEGA,LION,KING,VICTORY, POWER,SUPER,REBEL,TIGER,MEGAPOWER,STYLISH,REAL,RAJINI,KH…fans of all the other Stars.& My Dearest Fans,Have you ever watched yourself in a movie? Get Ready to Relive Your Life on the BIG Screen this year! #AndhraKingTaluka on 28-11-25 pic.twitter.com/8Ycscf1vuC— RAm POthineni (@ramsayz) August 21, 2025 -
సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా 'నువ్వుంటే చాలే'
రామ్ నటించిన కొత్త సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. త్వరలో థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గానే ఈ మూవీ నుంచి 'నువ్వుంటే చాలే' అని సాగే పాటని రిలీజ్ చేశారు. హీరో రామ్ ఈ పాటని రాయగా రాక్ స్టార్ అనిరుధ్ పాడటం విశేషం. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. సీజనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: 'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ: జయసుధ కొడుకు)మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఓ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ప్రేమకు నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయాణంలా ఈ సాంగ్ అనిపిస్తుంది. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోని ఇది మ్యూజిక్ లవర్స్‌కి బాగా నచ్చేసింది. ఇదే పాటలో రామ్, భాగ్య శ్రీ జంట చూడముచ్చటగా ఉంది. కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుందనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?) -
అదరగొడ్డున్న రామ్ రాసిన రొమాంటిక్ సాంగ్
-
ఆంధ్రా కింగ్ కోసం అనిరుధ్ పాట.. వీడియో రిలీజ్
యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలుకా'. ఈ మూవీని త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే తొలి గీతం రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ ప్రేమ పాటని ఆలపించాడు. తాజాగా దీని లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.'నువ్వుంటే చాలే' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంది. అనిరుధ్ వాయిస్‌తో పాటు విజువల్స్ కూడా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ సాంగ్‌కి వివేక్-మెర్విన్ ద్వయం సంగీతమందించారు. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మహేశ్ బాబు.పి దర్శకుడు. ఓ వీరాభిమాని బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. -
సెట్స్‌లో సూపర్‌స్టార్
సూపర్ స్టార్ సూర్యకుమార్ సెట్స్‌కు వచ్చారు. రామ్ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్ సూర్యకుమార్‌పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు.ఈ సూర్యకుమార్ అభిమానిగా హీరోగా రామ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు ఉపేంద్ర. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. హీరో, ఆ హీరో అభిమానికి మధ్య జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు సంగీతం: వివేక్–మెర్విన్. -
RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్‌ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్‌లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్‌పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం.