 
													రామ్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలుకా'. నవంబర్ 28న మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రాగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్యలో తీసిన మరో మెలోడీ గీతాన్ని తాజాగా రిలీజ్ చేశారు. 'చిన్ని గుండెలోనా..' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంటూ శ్రోతల్ని అలరిస్తోంది.
(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ రామ్‌కి హిట్స్ దక్కట్లేదు. ఈ క్రమంలోనే 'ఆంధ్రా కింగ్ తాలుకా'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఓ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో మూవీ తీస్తున్నారు. సినిమా హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఉండే ఎమోషన్స్ తదితర అంశాల్ని చూపిస్తూనే మరోవైపు ప్రేమకథని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
