పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్ | Telugu Tv Actors Sandra Ana Mahesh Babu Wedding | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కొత్త జీవితంలోకి.. పెళ్లి ఫొటో వైరల్

Oct 31 2025 5:20 PM | Updated on Oct 31 2025 7:04 PM

Telugu Tv Actors Sandra Ana Mahesh Babu Wedding

తెలుగు సీరియల్స్‌లో మనమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటిది 10కి పైగా సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బ్యూడీ సాండ్రా జైచంద్రన్. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈమె.. తన భర్త మరో అమ్మాయితోనూ రిలేషన్‌లో ఉన్నాడని విడాకులు ఇచ్చేసింది. తర్వాత సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ప్రియుడిని పరిచయం చేసిన ఈమె ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంది.

(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)

'కలవారి కోడలు' సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాండ్రా.. 'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం'లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'ఆటో విజయశాంతి' సీరియల్‌ చేస్తోంది. అయితే కొన్నాళ్ల ముందు నుంచి 'మనసిచ్చి చూడు', 'శుభస్య శీఘ్రం' సీరియల్స్‌లో హీరోగా చేసిన మహేశ్ బాబు కాళిదాసుతో కలిసి సాండ్రా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అలా కలిసి వీళ్లిద్దరూ వీడియోలు కూడా చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే సాండ్రా-మహేశ్ ప్రేమలో ఉన్నారా అని అంతా అనుకున్నారు. సడన్‌గా ఈ ఏడాది జూలైలో ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్‌లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు పెళ్లితో సీరియల్ నటులు ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాండ్రా.. సీరియల్స్‌తో పాటు ఆర్య, తకిట తకిట అనే తెలుగు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement