పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ | Tourist Family Director Abishek Jeevanth Marries Longtime Love Akhila in Chennai | Sakshi
Sakshi News home page

Abishan Jeevinth: చాన్నాళ్లుగా ప్రేమ.. చిన్న వయసులోనే పెళ్లి

Oct 31 2025 12:42 PM | Updated on Oct 31 2025 1:02 PM

Tourist Family Director Abishan Jeevinth Wedding

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ అనే కుర్రాడు.. ఇప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల అనే అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)

యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అభిషన్.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా మారి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.7 కోట్ల బడ్జెట్‌ పెడితే దాదాపు రూ.80-90 కోట్ల కలెక్షన్ ఈ మూవీకి వచ్చాయి. ఇదే చిత్రంలోనూ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. రీసెంట్‌గా హీరోగా ఓ మూవీ పూర్తి చేశాడు. రజనీకాంత్ కూతురు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్.

మరోవైపు అభిషన్‌కి రీసెంట్‌గానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' నిర్మాత మగేశ్ రాజ్.. ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని పెళ్లి బహుమతిగా ఇచ్చాడు. గురువారం చెన్నైలో రిసెప్షన్ జరగ్గా.. పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు హాజరైన కొత్త జంటని దీవించారు. ఇ‍ప్పుడు పెళ్లి కూడా జరగడంతో నూతన వధూవరుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement