breaking news
Tourist Family Movie
-
ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200% లాభాలు!
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. కంటెంట్ నచ్చితేనే థియేటర్‌కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి.1200% లాభాలుఅయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 1200% లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family Movie). ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఐదు వారాల్లోనే..టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం రూ.23 కోట్లు మాత్రమే రాగా.. మౌత్ టాక్ వల్ల రెండో వారం రూ.29 కోట్లు వచ్చాయి. ఐదు వారాలు తిరిగేసరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది.ఛావాను వెనక్కు నెట్టిఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్ 'ఛావా' ముందు వరుసలో ఉంది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 % లాభాలతో రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే.. టూరిస్ట్ ఫ్యామిలీ ఛావాను వెనక్కు నెట్టి 1200% లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండగా.. ఛావా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్ -
'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్
రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఆకట్టుకుంది. కేవలం రూ.5 కోట్లు పెడితే రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఇదే మూవీలో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతడు హీరో నానిని కలిశాడు.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?) 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా థియేటర్లలో ఉండగానే నాని చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. దర్శకుడు అభిషన్‌ని మెచ్చుకున్నాడు. నానితో పాటు రాజమౌళి కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని నాని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినిమా గురించి చాలా డీటైలింగ్‌గా మాట్లాడటం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని కుర్ర డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. నానిని కలవడం తనకు గౌరవంగా ఉందని కూడా అన్నాడు.రీసెంట్ టైంలో నాని ఓవైపు హీరోగా చేస్తూనే.. 'కోర్ట్' లాంటి చిన్న సినిమాలు తీస్తూ నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని కలిసి మాట్లాడాడు అంటే త్వరలో వీళ్లిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో తెలుగు వెర్షన్‌ని నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. చూసిన ప్రతిఒక్కరూ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి అభిషన్-నాని కాంబో ఏమైనా సెట్ అవుతుందేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) View this post on Instagram A post shared by Abishan Jeevinth (@abishan_jeevinth) -
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?
రీసెంట్ టైంలో ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదో తమిళ మూవీ. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడంతో మనోళ్లకు కూడా ఇది నచ్చేసింది. ఈ చిత్రంలో చిన్న పిల్లాడిగా చేసిన కమల్ జగదీశ్ కాకుండా ప్రధాన పాత్రధారి ధర్మదాస్.. ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి కూడా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే గానీ యువతకు తెగ నచ్చేసింది. దీంతో ఈ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈమె ఎవరంటే?(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)'టూరిస్ట్ ఫ్యామిలీ'లో ధర్మదాస్ అద్దెకు ఉండే ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి అసలు పేరు యోగలక్ష్మీ. చూడటానికి డస్కీగా ఉన్నప్పటికీ ఈమె యాక్టింగ్‌కి యూత్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని ఈమె ప్రపోజల్ సీన్‌ని రిపీట్స్‌లో చూస్తున్నారు. ఈమె విషయానికొస్తే.. ఈ సినిమా కంటే ముందు 'హార్ట్ బీట్', 'సింగపెన్నె' అనే వెబ్ సిరీసులు చేసింది. కాకపోతే ఓ మాదిరి గుర్తింపు మాత్రమే దక్కింది.ఈ మధ్య యూట్యూబ్‌లో 'మ్యాచ్ ఫిక్సింగ్' షార్మ్ ఫిల్మ్‌లోనూ యోగలక్ష్మీ నటించింది. ఈమెది తమిళనాడే అయినప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనే డీటైల్స్ దొరకట్లేదు. ప్రస్తుతానికైతే 'టూరిస్ట్ ఫ్యామిలీ' వల్ల ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఈమె అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈమెపై కొన్ని మీమ్స్ కూడా వస్తుండటం విశేషం. మరి తెలుగులోనూ ఎవరైనా దర్శక నిర్మాతలు ఈమెకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) View this post on Instagram A post shared by Yogz👾 (@iamyogalakshmi)