'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్ | Tourist Family Movie Director Abishan Jeevinth Met Actor Nani | Sakshi
Sakshi News home page

Nani: 'టూరిస్ట్ ఫ్యామిలీ' హిట్.. కుర్ర దర్శకుడితో నాని మీటింగ్

Jun 14 2025 3:34 PM | Updated on Jun 14 2025 3:46 PM

Tourist Family Movie Director Abishan Jeevinth Met Actor Nani

రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్‪‌ఫుల్ కలెక్షన్స్‌తో ఆకట్టుకుంది. కేవలం రూ.5 కోట్లు పెడితే రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఇదే మూవీలో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతడు హీరో నానిని కలిశాడు.

(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?

'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా థియేటర్లలో ఉండగానే నాని చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. దర్శకుడు అభిషన్‌ని మెచ్చుకున్నాడు. నానితో పాటు రాజమౌళి కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని నాని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినిమా గురించి చాలా డీటైలింగ్‌గా మాట్లాడటం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని కుర్ర డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. నానిని కలవడం తనకు గౌరవంగా ఉందని కూడా అన్నాడు.

రీసెంట్ టైంలో నాని ఓవైపు హీరోగా చేస్తూనే.. 'కోర్ట్' లాంటి చిన్న సినిమాలు తీస్తూ నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని కలిసి మాట్లాడాడు అంటే త్వరలో వీళ్లిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో తెలుగు వెర్షన్‌ని నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. చూసిన ప్రతిఒక్కరూ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి అభిషన్-నాని కాంబో ఏమైనా సెట్ అవుతుందేమో?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)  

Advertisement
 
Advertisement
Advertisement