విక్టరీ వెంకటేశ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు( అక్టోబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా ‘మాలా వచ్చా చూడు’ పాట మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాటను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ థియేటర్లలో సినిమా చూసిన వారికి నిరాశే ఎదురైంది. సినిమాలో ఈ పాటను తొలగించడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నచ్చిన పాటను సినిమాలో ఎందుకు ఉంచలేదంటూ చర్చించుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఆ వీడియోలు నావి కావు.. రూ.400 చెల్లించొద్దు: రితికా సింగ్)


